RRR: రఘురామ ఫిర్యాదుతో జగన్ సహా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసు.. పీవీ సునీల్ కుమార్ స్పందన..
ABN , Publish Date - Jul 12 , 2024 | 12:41 PM
గుంటూరు జిల్లా: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై కేసు నమోదయింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు.
గుంటూరు జిల్లా: ఐపీఎస్ అధికారి (IPS Officer) పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar)పై కేసు నమోదయింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)లో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజును కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని, చిత్ర హింసలు పెట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ సీఐడీ సునీల్‌తోపాటు పలువురు అధికారులపై పోలీసులు పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు.
జగన్ ప్రభుత్వ (Jagan Govt.,) హాయంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై (Custodial torture) గుంటూరు ఎస్పీ (Guntur SP)కి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగ్మోహన్ రెడ్డి, అప్పటి సీఐడీ, అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌లపై కేసు నమోదైంది. తనకు అయిన గాయాలపై కోర్టుకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి (Dr. Prabhavati) తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు. జగన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానని సునీల్ కుమార్ తనను బెదిరించారని కూడా రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు గుంటూ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
పీవీ సునీల్ కుమార్ స్పందన..
తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)పై అప్పటి ఐపీఎస్ అధికారి, సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ (PV Sunil Kumar) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ఆ కేసు సుప్రీం కోర్టులో మూడేళ్లు నడిచిందని.. సాక్షాత్ సుప్రీం కోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని’’ సునీల్ కుమార్ ట్టిట్టర్‌లో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పాలనలో పూర్తిగా కుదేలైన చేనేత రంగం..
అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డుకు పచ్చజెండా
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News