Share News

AP NEWS: ఆ వీఆర్వోలకు గుడ్ న్యూస్.. బకాయిలు విడుదల

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:04 PM

Ravinder Raju: ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్ వేయాలని ఆర్డర్ తేవడం సరైన విధానం కాదని ఏపీ ప్రభుత్వ వీఆర్వోల సంఘాల కార్యదర్శి రవీందర్ రాజు తెలిపారు. నీటిపారుదల ఎన్నికలు వీఆర్వోలతో లక్షల రూపాయల ఖర్చు పెట్టించారని అన్నారు. జగన్ ప్రభుత్వం రీసర్వేతో తప్పుడు విధానాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు.

AP NEWS: ఆ వీఆర్వోలకు గుడ్ న్యూస్..  బకాయిలు విడుదల
Ravindra Raju

విజయవాడ: గ్రేడ్ వన్ స్థాయిలో ఉన్న వీఆర్వోలకు ప్రమోషన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ వీఆర్వోల సంఘాల కార్యదర్శి రవీందర్ రాజు డిమాండ్ చేశారు. 2021 నుంచి బీఎల్వోల నుంచి రావాల్సిన బకాయలు రాలేదని చెప్పారు. ఆర్థిక మంత్రి దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లామని చెప్పారు. రూ. 58 కోట్లు వీఆర్వోలకు బడ్జెట్ విడుదల చేయటం సంతోషమని అన్నారు. 2019, 2024 నుంచి వలంటీర్ చేసిన పనులన్నీ వీఆర్వోలు చేస్తున్నారని చెప్పారు. ఉదయం ఐదు గంటలకు ఇచ్చే పెన్షన్ మార్పులు చేయాలని కోరారు. సచివాలయ సిబ్బంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.


ప్రభుత్వం పెన్షన్లు ఉదయం ఐదు గంటలకు పంపిణీ చేసే విధానాన్ని మార్పు చేయాలని అన్నారు. ఉదయం 10 గంటలకు పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటలకు బయోమెట్రిక్ వేయాలని ఆర్డర్ తేవడం సరైన విధానం కాదని తెలిపారు. నీటిపారుదల ఎన్నికలు వీఆర్వోలతో లక్షల రూపాయల ఖర్చు పెట్టించారని అన్నారు. జగన్ ప్రభుత్వం రీసర్వేతో తప్పుడు విధానాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 120 రోజుల్లో రీ సర్వే చేయాలని కేబినెట్‌లో ఆమోదం పెట్టడం సరికాదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం చేయకూడదని ఆశిస్తున్నామని రవీందర్ రాజు పేర్కొన్నారు

Updated Date - Dec 29 , 2024 | 08:38 PM