Share News

AP Govt: ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం

ABN , Publish Date - Jul 14 , 2024 | 06:40 PM

విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌‌తో (Nara Lokesh) ఈరోజు(ఆదివారం) మాంఛో ఫెర్రర్ భేటీ అయ్యారు. మంగళగిరి చేనేత శాలువాతో ఫెర్రర్‌ని మంత్రి లోకేష్ సత్కరించారు.

AP Govt: ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం

అమరావతి: విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌‌తో (Nara Lokesh) ఈరోజు(ఆదివారం) మాంఛో ఫెర్రర్ భేటీ అయ్యారు. మంగళగిరి చేనేత శాలువాతో ఫెర్రర్‌ని మంత్రి లోకేష్ సత్కరించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) నిర్వాహకులు మాంఛో ఫెర్రర్ హమీ ఇచ్చారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్డీటీ అందిస్తున్న సేవలు స్పూర్తిదాయకమని లోకేష్ తెలిపారు.


ఈ వార్త కూడా చదవండి: AP DGP: ఎవరైనా దాడులకు పాల్పడితే.. సహించేది లేదు

1969లో విన్సెంట్ ఫెర్రర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రారంభించారని తెలిపారు. నేటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 3 వేల గ్రామాల్లో అందిస్తున్న సేవలను మంత్రి లోకేష్ కొనియాడారు. వేల కోట్ల ఖర్చుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పల్లెల్లో ఆస్పత్రుల నిర్మాణం, పేదలకు ఆర్థిక సహాయాన్ని ఆర్డీటీ చేస్తుందని వివరించారు. ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్యం, చెక్ డ్యాంల నిర్మాణం, గ్రామాల్లో తాగునీటి సదుపాయం కల్పించిందన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా ప్రజలకు సేవలు అందిస్తోందని మంత్రి లోకేష్ ప్రశంసించారు.


ఈ వార్త కూడా చదవండి: Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

యువగళం పాదయాత్రలో తాను ఆర్డీటీ కార్యాలయాన్ని సందర్శించానని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్డీటీ సేవలు మరింత విస్తరించే విధంగా కలిసి పనిచేద్దామని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి, మహిళా సాధికారత, స్కిల్ డెవలప్మెంట్, ఫారిన్ లాంగ్వేజస్ నేర్పడం ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వంటి కార్యక్రమాలకు సాయం చేయాలని మాంఛో ఫెర్రర్‌ను మంత్రి లోకేష్ కోరారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా మాంఛో ఫెర్రర్‌ స్పందించారు. ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకొని ప్రభుత్వంతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, సేవా, మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gudivada: కొడాలి నాని సన్నిహితుడి బంకులో కల్తీ పెట్రోలు.. సగానికిపైగా నీళ్లే..!

Harish Rao:రాజకీయాల్లో అలా ఉండటం చాలా అరుదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

Rakesh Reddy: నిరుద్యోగులపై రేవంత్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 06:51 PM