Share News

AP Cabinet: గురువారం ఒక్కరోజే బాధ్యతలు స్వీకరించనున్న ఏడుగురు ఏపీ మంత్రులు

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:24 PM

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ఘన విజయంతో సాధించడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు(CM Chandrababu) సహా మంత్రులుగా పలువురు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఇప్పటికే శాఖలు సైతం కేటాయించారు.

AP Cabinet: గురువారం ఒక్కరోజే బాధ్యతలు స్వీకరించనున్న ఏడుగురు ఏపీ మంత్రులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ఘన విజయంతో సాధించడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు(CM Chandrababu) సహా మంత్రులు(AP Ministers)గా పలువురు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఇప్పటికే శాఖలు సైతం కేటాయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించగా.. ఉపముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఇవాళ(బుధవారం) విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరో ఏడుగురు మంత్రులు గురువారం రోజున సచివాలయంలో మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


గురువారం బాధ్యతలు చేపట్టనున్న మంత్రులు వీరే..

గురువారం ఉదయం 7:30గంటలకు సచివాలయం 5వ బ్లాక్‌లో కార్మిక, ఫ్యాక్టరీలు, ఇన్సురెన్స్, మెడికల్ సర్వీస్ మంత్రిగా వాసంశెట్టి సుభాశ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 4వ బ్లాక్‌లో 9గంటలకు జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు... పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 10:30గంటలకు దేవదాయ శాఖ మంత్రిగా గొల్లపూడిలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఆనం రాంనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. సచివాలయం 4వ బ్లాక్‌లో 10:35లకు బీసీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్, హ్యండ్ లూమ్స్, చేనేత మంత్రిగా సవిత, 11.30లకు రెవెన్యూ, రిజిష్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు చేపడతారు. ఇక సాయంత్రం 5:30కు టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ మంత్రిగా 2వ బ్లాక్‌లో మంత్రి కందుల దుర్గేశ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Jun 19 , 2024 | 09:04 PM