Share News

TDP: తప్పు చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం

ABN , Publish Date - Nov 12 , 2024 | 06:29 PM

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టుల అంశం కాకరేపుతోంది. సోషల్ పోస్టుల అంశంపై వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీడీపీ నేతలు స్పందించారు. దొంగే దొంగ అన్నట్టు ఉంది అని విరుచుకుపడ్డారు. వారే పోస్టులు చేసి, నెపం తమపై నెడుతున్నారని మండిపడ్డారు.

TDP: తప్పు చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం
TDP Reacts About YSRCP Complaint

అమరావతి: సోషల్ మీడియా పోస్టుల అంశంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. సోషల్ పోస్టులపై అధికార తెలుగుదేశం పార్టీపై వైసీపీ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. దొంగే దొంగ అన్నట్టుంది అని విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేతలే తప్పు చేసి.. నెపంతో తమపై వేయడం సరికాదని సూచించారు. తప్పు చేసిన వారిని ఎవరిని పోలీసులు వదలరని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే, మాట్లాడితే అరెస్ట్ చేయడం లేదని గుర్తుచేశారు. మహిళలు అని కూడా చూడకుండా టార్గెట్ చేసి కామెంట్స్ చేశారని వివరించారు.


ycp.jpg


భుజాలు తడుముకున్నట్టు

‘దొంగే దొంగ అన్నట్టు ఉంది. గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుముకున్నట్టు వైసీపీ నేతల వైఖరి ఉంది. వైయస్ఆర్ సీపీ ఎంపీలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయడం చూస్తే నవ్వొస్తోంది. అసలు మానవ హక్కుల ఉల్లంఘన అర్థం వైసీపీ నేతలకు తెలుసా..? చట్టం ప్రకారమే కేసులు నమోదవడం, విడుదల కావడం జరుగుతుంది. ఇదే అంశం వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది. అమరావతిలో మహిళలను నడిరోడ్డుపై జుట్టు పట్టి లాగి చేసిన హింస మానవ హక్కుల ఉల్లంఘన కాదా..? డాక్టర్ సుధాకర్‌ మృతి మానవ హక్కుల ఉల్లంఘన కాదా..? డాక్టర్‌పై పిచ్చివాడిగా ముద్ర వేసి హతమార్చడం మానవ హక్కుల ఉల్లంఘన కాదా అని’ టీడీపీ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


TDP FLAG copy.jpg


సొంత పార్టీ ఎంపీని అరెస్ట్ చేసి..

‘సొంత పార్టీ ఎంపీని అరెస్టు చేసి, భౌతిక దాడికి దిగడం మానవ హక్కుల ఉల్లంఘన కాదా..? గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వేలాది మంది బాలికలు, మహిళలు కనిపించకుండా పోయారు. ఆ అంశంపై ఒక్కసారైనా నోరు మెదిపారా. సోషల్ మీడియా ముసుగులో వైసీపీ కార్యకర్తలు దుర్మార్గంగా వ్యవహరించారు. తప్పు చేసినవారిపై వ్యవస్థల్లో ఉన్న చట్టాల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాం. అంతే తప్ప.. గత ప్రభుత్వం మాదిరిగా వేధింపులు లేవు అని’ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరుమలగిరి జోష్ణ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

BRS: పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది: కేటీఆర్

Varraravinder Reddy: వర్రారవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్డ్‌లో కీలక అంశాలు

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 12 , 2024 | 06:29 PM