Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు
ABN , Publish Date - Oct 26 , 2024 | 06:25 PM
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది జరిగిన ఘటనపై శనివారం నాడు కేసు నమోదు చేశారు. రాజమండ్రి జైలులో ఉన్న అనిల్‌ను కస్టడీకి తీసుకున్నారు.
గుంటూరు: వైసీపీ నేత, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 31వ తేదీన బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి జరిగింది. ఆ ఘటనపై ఈ రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ ఏ1గా, బోరుగడ్డ అనిల్ ఏ2 ఉన్నారు.
రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి వస్తుండగా సత్యకుమార్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఆ దాడిలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. సురేష్, అనిల్ సహా 25 మందిని నిందితులుగా చేర్చారు. రాజమండ్రి జైలులో ఉన్న అనిల్‌పై కేసు నమోదు చేశారు. కస్టడీకి తీసుకొని, వైద్య పరీక్షల కోసం జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అరండల్ పేట పోలీసులు మూడురోజుల పాటు అనిల్‌ను ప్రశ్నించనున్నారు.
వెలగపూడిలో జరిగిన మహిళ హత్య కేసులో నందిగం సురేష్ గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. డబ్బుల కోసం బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు. దాంతోపాటు ఏపీ సీఎం చంద్రబాబును దూషించిన కేసు కూడా అనిల్ మీద ఉంది.