AP NEWS: పల్నాడు జిల్లాలో అల్లర్లకు వైసీపీ ప్లాన్.. టీడీపీ నేతలపై దాడి
ABN , Publish Date - Feb 15 , 2024 | 09:59 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని అనుకున్నదే తడవుగా ప్రత్యర్థి పార్టీ టీడీపీ నేతలపై వైసీపీ రౌడీ మూకలను దాడులకు ఊసిగోల్పుతుంది.
పల్నాడు జిల్లా: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని అనుకున్నదే తడవుగా ప్రత్యర్థి పార్టీ టీడీపీ నేతలపై వైసీపీ రౌడీ మూకలను దాడులకు ఊసిగోల్పుతుంది. వైసీపీ నేతల ప్లాన్‌లో భాగంగానే పల్నాడు జిల్లాలో మరోసారి అల్లర్లకు తెరలేపారు. జిల్లాలో మరోసారి వైసీపీ మూకలు రెచ్చిపోయి టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలపై వైసీపీ మూకలు హత్య ప్రయత్నం చేసి తీవ్ర భయాందోళనలకు గురి చేశారు.
దుర్గి మండలం జంగమేశ్వర పాడుకు చెందిన టీడీపీ నాయకులపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దుర్గి నుంచి కోలగుట్లకు టీడీపీ నేతలు వెళ్తుండగా వైసీపీ మూకలు దారి కాచి దాడి చేశారు. ఈ దాడిలో గాజుల అంజి (35), పాశం రాజు (37), గుమ్మ శ్రీను (38) లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దాడిలో గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైసీపీ మూకల దాడులతో జిల్లా అంతటా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.