Share News

AP High Court : అవినాష్ రెడ్డి పీఏ బెయిల్‌పై ముగిసిన వాదనలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:00 AM

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో జనవరి 7న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ ప్రకటించారు.

 AP High Court : అవినాష్ రెడ్డి పీఏ బెయిల్‌పై ముగిసిన వాదనలు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో జనవరి 7న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ ప్రకటించారు. సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టేలా ప్రేరేపించారనే ఆరోపణలతో పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ బండి రాఘవరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. పిటిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదయ్యిందని గుర్తు చేశారు. సంబంధిత కోర్టులోనే పిటిషన్‌ వేసుకోవాలి కదా అని ప్రశ్నించారు. పిటిషనర్‌ తరపున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ నేరుగా ఎలాంటి దూషణలకు పాల్పడలేదని, అందువల్ల ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు చెల్లుబాటు కాదన్నారు. అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సందీప్‌ వాదనలు వినిపిస్తూ.. పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో పిటిషనర్‌ నిందితుడు కాదన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన కేసులలో సంబంధిత కోర్టుల్లోనే బెయిల్‌ లేదా ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసుకోవాలన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ పిటిషన్లు కొట్టివేయాలని కోరారు.

Updated Date - Dec 27 , 2024 | 06:00 AM