Jada Sravan: దస్తగిరి కుటుంబంపై దాడి.. జగన్, అవినాష్ కిరాతకాలకు సాక్ష్యం..
ABN , Publish Date - Mar 09 , 2024 | 10:59 AM
Andhrapradesh: వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి కిరాతక చర్యలకు మరో సాక్ష్యం... రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయనున్న దస్తగిరి కుటుంబ సభ్యులపై పాశవిక దాడి అని జై భీమ్ భారత్ పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసే మొనగాడా అంటూ దస్తగిరి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపటానికి వైసీపీ గుండాలు ప్రయత్నించాయని మండిపడ్డారు.
అమరావతి, మార్చి 9: వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan Reddy), అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) కిరాతక చర్యలకు మరో సాక్ష్యం... రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేయనున్న దస్తగిరి (Dastagiri) కుటుంబ సభ్యులపై పాశవిక దాడి అని జై భీమ్ భారత్ పార్టీ చీఫ్ జడ శ్రావణ్ కుమార్ (Jai Bheem Bharat Party Chief Jada Sravan) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసే మొనగాడా అంటూ దస్తగిరి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపటానికి వైసీపీ గుండాలు ప్రయత్నించాయని మండిపడ్డారు. దస్తగిరి పోటీలో నుంచి విరమించుకోకపోతే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామంటూ హెచ్చరికలు చేశారన్నారు.
నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో పులివెందుల మండలం నమాలగుండు గ్రామంలో మాటు వేసి మరీ వైఎస్ అవినాష్ రెడ్డి గుండాలు దాడి చేశాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే దస్తగిరి ప్రకటించారన్నారు. గత వారం జై భీమ్ రావ్ భారత్ పార్టీలో దస్తగిరి చేరారన్నారు. దస్తగిరి అభ్యర్థిత్వంపై ఏమీ చేయలేని వైఎస్ అవినాష్ రెడ్డి & జగన్మోహన్ రెడ్డి.. దస్తగిరి కుటుంబ సభ్యులపై దాడి చేయటం అత్యంత శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దస్తగిరి కుటుంబ సభ్యులందరికీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జరిగిన దారుణంపై 12న సీబీఐ కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయవలసిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. జరిగిన ఈ దుర్ఘటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి హస్తం ఉందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే ఈ దారుణ దుర్ఘటన జరిగిందని జడా శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ‘‘నాకు నా కుటుంబ సభ్యులకు తక్షణమే భద్రత కల్పించాలి’’ అని దస్తగిరి కోరారు.
ఇవి కూడా చదవండి..
AP Elections 2024: ఎన్నికలకు ముందు సంచలన సర్వే విడుదల.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సర్వే..
TS News: అరబ్ కంట్రీలో హైదరాబాదీకి వరకట్న వేధింపులు.. ఈ అమ్మాయి బాధ ఎవ్వరికీ రావొద్దు..
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...