ఇప్పుడు గుర్తుచ్చొరా ఆడోళ్లు..: జేసీ
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:22 AM
‘పేర్ని నాని మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన మొహంలో రక్తపు చుక్కలేదు. ఏం.. అధికారంలో ఉన్నపుడు ఏం మాట్లాడావో మరిచిపోయావా?

అనంతపురం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘పేర్ని నాని మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన మొహంలో రక్తపు చుక్కలేదు. ఏం.. అధికారంలో ఉన్నపుడు ఏం మాట్లాడావో మరిచిపోయావా? మామీద కేసులు పెట్టినపుడు కనిపించలేదా? మా ఇంట్లో ఆడోళ్లు లేరా? ఇప్పుడు నీదాకా వస్తే ఆడోళ్లు గుర్తొచ్చారా? బియ్యం అమ్ముకున్నోనివి ఇప్పుడు సుద్దులు చెప్తున్నావా?’ అంటూ మాజీ మంత్రి పేర్నినానిపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ఆదివారం అనంతపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు గురించి ఏం మాట్లాడావో గుర్తు లేదా? నువ్వు, ఆ జగన్ కూర్చొని చంద్రబాబును అరెస్టు చేయించింది వాస్తవం కాదా? కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడును ఇబ్బంది పెట్టి ఆ రోజు ఆనందించిన విషయాన్ని మరిచిపోయారా? నా మీద, నా కొడుకు, నా కోడలు, నా భార్య మీద కేసులు పెట్టారు కదా ఆరోజు కనబడలేదా? నన్ను అన్యాయంగా 120రోజులు జైలులో పెట్టించారు. ఈ పొద్దు నీ భార్య అంటున్నారని బాధొచ్చిందా... మా తల్లి భువనేశ్వరి ఎప్పుడూ బయటకు రాలేదు. అసెంబ్లీలో మీరు చేసినదానికి బయటికి రావాల్సి వచ్చింది. చేయాల్సిన తప్పులు చేసి దొరికిపోయావ్. ఇప్పుడు మీఇంట్లో ఆడోళ్లు ఉన్నారని గుర్తొచ్చిందా? మీ ఇంట్లో ఆడోళ్ల గురించి చెప్పాలంటే చాలా ఉంది. సభ్యత కాదు.. నీ బ్యాటరీ సరిగా లేదు. ఏం.. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు చేసుకుంటే నీకెందుకు? విడాకులిచ్చాడు.. లీగల్‌గానే చేసుకున్నాడు. పవన్ మంచోడు కాబట్టి ఊరుకున్నాడు తప్ప.. మిమ్మల్ని ఏమీ చేయలేక కాదు’ అని హెచ్చరించారు.