Share News

CM Jagan: పులివెందులలో అమల్లోకి రాని ఎన్నికల కోడ్..

ABN , Publish Date - Mar 25 , 2024 | 09:28 AM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఎన్నికల కోడ్ కావడం లేదు. అభ్యర్థులు సీఎం జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డిల ఫోటోలతో శిలాఫలకాలు, బ్యానర్లు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల అధికారులు వీటిని తొలగించేందుకు ముందుకు రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ కూసి చాలా రోజులవుతోంది. అయినా సరే అధికార పార్టీ మాత్రం కోడ్ నిబంధలను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు.

CM Jagan: పులివెందులలో అమల్లోకి రాని ఎన్నికల కోడ్..

కడప : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan) పులివెందుల (Pulivendula)లో ఎన్నికల కోడ్ (Election Code) కావడం లేదు. అభ్యర్థులు సీఎం జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy)ల ఫోటోలతో శిలాఫలకాలు, బ్యానర్లు, పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. చాలా చోట్ల అధికారులు వీటిని తొలగించేందుకు ముందుకు రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ కూసి చాలా రోజులవుతోంది. అయినా సరే అధికార పార్టీ మాత్రం కోడ్ నిబంధలను పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. ఎన్నికల కోడ్ నిబంధలను తుంగలో తొక్కుతున్నా అధికారులు మాత్రం పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YSRCP) నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆయా ప్రాంతాల్లో వివాదాస్పదమవుతోంది. ప్రతిపక్షాలు సైతం అధికార పార్టీ వ్యవహారశైలిపై మండిపడుతున్నారు.

ఉన్నత విద్య.. మిథ్య!

ముఖ్యంగా ముఖ్యంగా కడప (Kadapa) జిల్లాలో ఎన్నికల కోడ్ యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతోంది. గతంలో శ్మశానాలకు సైతం వైసీపీ రంగులు వేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని తొలగించేందుకు ససేమిరా అంటోంది. అధికారులు సైతం వైసీపీ రంగులు, పోస్టర్ల జోలికి వెళ్లడం లేదు. ప్రతిపక్షాలు ఏమైనా పోస్టర్లు అంటిస్తే మాత్రం వాటిని తొలగించే వరకూ వదలడం లేదు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంటే కడప జిల్లా అందునా స్వయానా సీఎం జగన్ సొంత ఇలాఖ అయిన పులివెందుల పరిస్థితి ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాలా? అక్కడ వైసీపీ నేతలు చేసిందే శాసనం. కోడ్ నై.. గీడ్ నై అంటున్నారు. ప్రతిపక్షాలకే కానీ ఈ కోడ్‌లు తమకు కాదంటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

AP News: కడప జిల్లాలో దారుణం

దేశ వ్యాప్తంగా పది రోజుల నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అటు దేశంలో లోక్‌సభ, ఏపీలో అయితే ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కోడ్‌ను మరింత పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రకటించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ‘కోడ్ మీకే కానీ మాకు కాదు..!’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర సర్కార్ ఆధీనంలోని సైబర్ నెట్‌లో యధేచ్ఛగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఊదరగొడుతోంది. సీఎం జగన్ ఫోటోలు, ఆయన విద్వేషపూరిత ప్రసంగాలను ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) గత వీడియోలతో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తోంది.

Narayana: ఆనాటి కష్టాలను ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నారు..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 10:14 AM