Share News

AP Politics: PADAలో అవినీతిపై పులివెందుల ప్రజలు ఆలోచించాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

ABN , Publish Date - Jun 25 , 2024 | 04:00 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి(MLC Bhumireddy Ramgopal Reddy) ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కి పార్టీ ఆఫీసులను ఇంద్ర భవనాల్లాగా కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Politics: PADAలో అవినీతిపై పులివెందుల ప్రజలు ఆలోచించాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి
MLC Bhumireddy Ramgopal Reddy

పులివెందుల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు వైసీపీ(YSRCP) కార్యాలయాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి(MLC Bhumireddy Ramgopal Reddy) ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కి పార్టీ ఆఫీసులను ఇంద్ర భవనాల్లాగా కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన అనుమతులు లేకపోవడంతోనే అధికారులు వాటిని కూల్చివేస్తున్నట్లు పులివెందుల (Pulivendula) ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ చెప్పుకొచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అధికారులు అనేకసార్లు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ఎమ్మెల్సీ భూమిరెడ్డి గుర్తు చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.."ఎన్నికల్లో ఓటమి తర్వాత పులివెందులకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భద్రత ఏ విధంగా కల్పించామో అందరూ గమనించారు. ప్రతిపక్ష నాయకుడు కానప్పటికీ సుమారు 400మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. వైసీపీ హయాంలో కొంతమంది అధికారులు మా పార్టీ కార్యకర్తలను హింసించి నేడు మేము కూడా టీడీపీ సానుభూతిపరులమే అంటున్నారు. నియోజకవర్గంలో వేలాదికోట్ల రూపాయల పనులు జరిగాయి. ఏ శాఖలో ఏం పనులు జరిగాయో చెప్పమని అధికారులను వివరాలు కోరితే ఇంతవరకు సమాధానం లేదు.


పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(PADA)లో ఎంత అవినీతి జరిగిందో నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. నిజంగా ప్రజలకు ఉపయోగపడేలా నిధులు వినియోగిస్తే ఎందుకు దాచి పెడుతున్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో పాడా ఆడిట్ జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాలో ఇష్టానుసారంగా గన్ లైసెన్సులు ఇచ్చారు. ఇది దేనికి సంకేతం. 2029ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగరవేస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:

Diarrhea: డయేరియా నేపథ్యంలో జగ్గయ్యపేటలో మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు పర్యటన..

Updated Date - Jun 25 , 2024 | 04:08 PM