Share News

Kodali Nani: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 09:28 PM

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై (TDP Janasena BJP Alliance) మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రానని తెలిసినా.. తనపై ఉన్న కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పొత్తు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.

Kodali Nani: టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుపై (TDP Janasena BJP Alliance) మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రానని తెలిసినా.. తనపై ఉన్న కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ పొత్తు డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ (NTR) తెలుగుదేశం పార్టీ పెడితే.. దానిని చంద్రబాబు లాక్కున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పడిగాపులు పడి.. ప్రధాని మోదీ (PM Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అందుబాటులో లేకపోయినప్పటికీ వారి పీఏలతో చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని అన్నారు.


అధికారంలో ఉన్నప్పుడు నల్ల చొక్కా వేసుకొని.. మన రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని చంద్రబాబు పోరాటాలు చేశారని కొడాలి నాని గుర్తు చేశారు. భార్య, పిల్లలు లేని మోదీ.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడని ప్రశ్నించారు. గతంలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీతో (Congress Party) కలిసి పోటీ చేసిన చంద్రబాబు.. మళ్లీ ఇప్పుడు ప్రధాని మోదీ గొప్పవాడని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నానని అంటున్నారని విమర్శించారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని చెప్పిన చంద్రబాబు.. అదే పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు. వెయ్యి మంది మోదీలు, లక్ష మంది చంద్రబాబులు, కోటి మంది పవన్‌కళ్యాణ్‌లు (Pawan Kalyan) కలిసొస్తే ఎంత బలం ఉంటుందో.. అంతకన్నా లక్షల రెట్ల బలమున్న భగవంతుడి ఆశీస్సులు సీఎం జగన్‌కి ఉన్నాయని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 09:29 PM