AP Elections: ఎన్టీఆర్ జిల్లాలో కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Feb 26 , 2024 | 10:39 AM
Andhrapradesh: గంపలగూడెం మం కొణిజర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి టీడీపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కొణిజర్ల గ్రామంలో కొలికపూడికి గ్రామస్థులు, టీడీపీ శ్రేణులు హారతులు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజల ఆధ్యర్యంలో ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 26: గంపలగూడెం మం కొణిజర్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి టీడీపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas rao) ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కొణిజర్ల గ్రామంలో కొలికపూడికి గ్రామస్థులు, టీడీపీ శ్రేణులు హారతులు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజల ఆధ్యర్యంలో ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి పాల్గొన్నారు. కొణిజర్ల గ్రామంలో వైసీపీ యువనేత కన్నా ఆధ్యర్యంలో పలువురు వైసీపీ కుటుంబాలు.. కొలికపూడి సమక్షంలో టీడీపీలో చేరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రూ.1500 నగదు ప్రోత్సాహం టీడీపీ - జనసేన (TDP-Janasena Alliance) ఉమ్మడి పార్టీలు అందచేస్తాయన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అక్కడి ప్రజలకు కొలికపూడి వివరించారు.
ప్రతిరోజు పెరుగుతున్న ధరలతో భార్యాభర్తలు పనిచేసిన కుటుంబ పోషణ గడవని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. రానున్న మరో రెండు నెలల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని ప్రజలకు భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రైవేటు స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రానున్న 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందన్నారు. ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తిరువూరు నియోజకవర్గంలో తాను రాజకీయాల కోసం రాలేదని అభివృద్ధి కోసం వచ్చానని చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేయాలంటే అభివృద్ధి చేసే చంద్రబాబు - పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమన్నారు. జై చంద్రబాబు,జై పవన్ కళ్యాణ్ జై కొనిజర్ల అంటూ కొలికపూడి శ్రీనివాసరావు నినాదాలు చేపట్టారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..