Ram Charan: రామ్‌చరణ్ 256 అడుగుల కటౌట్.. ఎక్కడంటే
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:40 PM
Ram Charan Cutout: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తులో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. 'గేమ్ ఛేంజర్' చిత్రంలో ఉన్న స్టిల్‌తో ఈ కటౌట్ రూపొందించారు. వజ్రా గ్రౌండ్స్‌లో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ ఆవిష్కరించనున్నారు. ఈ కటౌట్‌ను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానులతో వజ్రా గ్రౌండ్స్ కోలాహలంగా మారింది.
విజయవాడ: విజయవాడలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారీ కటౌట్ వెలిసింది. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల ఎత్తులో 'గేమ్ ఛేంజర్' కటౌట్‌ను ఏర్పాటు చేశారు. కాసేపట్లో 'గేమ్ ఛేంజర్' కటౌట్‌ను మూవీ టీం ఆవిష్కరించనుంది. అనంతరం హెలికాఫ్టర్‌లో పూల వర్షం కురిపించడానికి ఏర్పాట్లు చేశారు. తమ అభిమాన హీరో భారీ కటౌట్ ఏర్పాటు చేయడం పట్ల రామ్ చరణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కటౌట్‌ను చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానులతో వజ్రా గ్రౌండ్స్ కోలాహలంగా మారింది.గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కోసం రూ. 40 లక్షలతో అభిమానులు ఈవెంట్ ఏర్పాటు చేశారు. వజ్రా గ్రౌండ్‌లో గ్లోబల్ స్టార్ రాంచరణ్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. బాబాయి, అబ్బాయి ఫ్లెక్సీలతో అభిమానులు సందడి చేశారు.
హెలికాప్టర్ ద్వారా 256 అడుగుల రాంచరణ్ కటౌట్‌కు పుష్పాభిషేకం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా చిత్ర నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకులు తమన్ రానున్నారు. శంకర్, రాంచరణ్ కాంబినేషన్‌లో గేమ్ చేంజర్ మూవీ రికార్డులు తిరగ రాస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కథాంశంతో ద్విపాత్రాభినయంతో రాంచరణ్ ఈ మూవీలో కనువిందు చేయనున్నారు. ఇప్పటికే పాటలు, డ్యాన్స్‌లు అలరించడంతో సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. జనవరి 10న 'గేమ్ ఛేంజర్' విడుదల చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్‌పై మూవీ యూనిట్ దృష్టి సారించింది. 256 అడుగుల భారీ కటౌట్ గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.