Share News

AP NEWS: జీజేఎం ట్రస్ట్‌కు ఏపీ హైకోర్టు కీలక అనుమతులు

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:30 PM

ఏపీ హై కోర్టులో జీజేఎం ట్రస్ట్‌ ఓ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్‌‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో కీలక ఆదేశాలు జారీ చేసింది. జీజేఎం ట్రస్ట్‌కు సిమెంటు బెంచీలు మరియు ఇతర వసతులు ఏర్పాటు చేయడానికి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులో వాకర్స్ విన్నపాన్ని మన్నించి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు.

AP NEWS: జీజేఎం ట్రస్ట్‌కు ఏపీ హైకోర్టు కీలక అనుమతులు

చిత్తూరు: ఏపీ హై కోర్టులో జీజేఎం ట్రస్ట్‌ ఓ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్‌‌పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో కీలక ఆదేశాలు జారీ చేసింది. జీజేఎం ట్రస్ట్‌కు సిమెంటు బెంచీలు మరియు ఇతర వసతులు ఏర్పాటు చేయడానికి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులో వాకర్స్ విన్నపాన్ని మన్నించి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. దీనిని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్, పోలీసులు గత కొన్ని రోజుల క్రితం అడ్డుకున్నారు.

ఈ విషయంపై హైకోర్టుకు జీజేఎం సంస్థ నిర్వాహకులు వెళ్లారు. జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ సిమెంట్ బెంచ్‌లు మరియు ఇతర వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా అనుమతి ఇవ్వవలసిందిగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ట్రస్ట్ తరఫున ప్రముఖ హైకోర్టు న్యాయవాది దొడ్ల కిషోర్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ ప్లీడరు హాజరయ్యారు.

Updated Date - Feb 12 , 2024 | 10:30 PM