Share News

YS Sharmila: ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు.. కూటమి సర్కార్‌కు షర్మిల సూటి ప్రశ్న

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:43 PM

Andhrapradesh: విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో షర్మిల ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో టిక్కెట్ కొని.. ఉచితం ఎప్పుడిస్తారు అంటూ సర్కార్‌కు సూటి ప్రశ్న వేశారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు‌కు పీసీసీ చీప్ పోస్ట్ కార్డు రాశారు.

YS Sharmila: ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు.. కూటమి సర్కార్‌కు షర్మిల సూటి ప్రశ్న
APCC Chief YS Sharmila Reddy

విజయవాడ, అక్టోబర్ 18: ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి (APCC Chief YS Sharmila Reddy) పలు ప్రశ్నలు సంధించారు. శుక్రవారం విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో షర్మిల ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో టిక్కెట్ కొని.. ఉచితం ఎప్పుడిస్తారు అంటూ సర్కార్‌కు సూటి ప్రశ్న వేశారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు‌కు (CM Chandrababu) పీసీసీ చీఫ్ పోస్ట్ కార్డు రాశారు.

Gali Janardana Reddy: బీజేపీపై అసత్య ఆరోపణలు మానుకోవాలి.. లేకుంటే...


ఆర్టీసీకి డబ్బులు చెల్లించాల్సి వస్తుందనా...

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయిందని.. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వారంలో అమలు చేశారని... ఏపీలో పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనా అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని.. రోజు మహిళల ద్వారా రూ.7 కోట్ల ఆదాయం... నెలకు రూ.300 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఉచిత ప్రయాణం కల్పిస్తే... ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా అని నిలదీశారు.


ఇది చాలా మంచి పథకం

‘‘మహిళల ఓట్లు తీసుకున్నారు. హామీ ఇచ్చారు. ఇప్పుడు మహిళల కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయలేరా ?. మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పథకాలు మహిళలవే. ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు. ఇలాంటి తక్కువ ఖర్చు పథకం మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదు. మీకు ఇష్టం వచ్చినప్పుడు అమలు చేస్తారా. ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి. 5 ఏళ్లు ఇలానే కాలయాపన చేస్తారా. ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు భద్రత ఉంటుంది. ఎంతో మంది మహిళలు బస్సులను ఆశ్రయిస్తారు. ఇది చాలా మంచి పథకం. సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయండి. అదే విధంగా మహిళల కోసం పెట్టిన పథకాలు వెంటనే అమలు చేయండి. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి. ఇప్పటికే మార్కెట్‌లో అన్ని ధరలు పెరిగాయి. మహిళల మీద భారం పడుతోంది. మహిళలకు భరోసా కావాలి. మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలి’’ అని చెప్పుకొచ్చారు.

Viral Video: రావణుడిని చంపింది ఎవరు.. టీచర్ ప్రశ్నకు ఈ కుర్రాడి సమాధానం వింటే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవాల్సిందే..


ఇది చూసైనా..

‘‘ రాష్ట్రంలో నెల రోజుల్లో హత్యాచారాల మీద రిపోర్ట్ తీశాం. అన్ని పెపర్ల నుంచి ఆర్టికల్స్ సేకరించాం. 99 కే మద్యం ఇస్తే.. మహిళల మీద హత్యాచారాలు పెరుగుతాయి. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నాం. రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తన పోస్ట్ కార్డులు పంపిస్తాం. ఇది చూసైనా వెంటనే చంద్రబాబు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలి’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

AP News: భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

Lokesh: ఆ ఖర్చును నా ఖాతాలో వేస్తారా: నారా లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 01:09 PM