Viral Video: ఇదెక్కడి వింత బైక్.. బైక్‌కు ట్రాక్టర్ చక్రం అమర్చి రోడ్డుపై రైడ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు..
ABN , Publish Date - Oct 18 , 2024 | 09:35 AM
కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అభినందిస్తుంటే, మరికొందరు మాత్రం నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే, మరికొన్ని ఫన్నీగా నవ్వు (Funny Videos) తెప్పించేవిగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎక్కువగా హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు అభినందిస్తుంటే, మరికొందరు మాత్రం నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
shiva__pushkar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి వెరైటీ బైక్ (Strange bike) మీద ప్రయాణిస్తున్నాడు. చాలా ఎత్తులో కూర్చొని ఈ వింత వాహనాన్ని డ్రైవర్ నడపాలి. ఎందుకంటే ఆ వాహనానికి ముందు వైపు ట్రాక్టర్ చక్రం (Tractor wheel) అమర్చాడు. వెనుక వైపు స్కూటర్ చక్రం బిగించాడు. ఓ సాధారణ మోటర్ బిగించి ఈ వాహనాన్ని నడుపుతున్నాడు. రోడ్డు మీద ఈ వింత వాహనంపై ప్రయాణిస్తున్న ఆ వ్యక్తిని చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న వేరే వ్యక్తి ఆ వింత వాహనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా వీక్షించారు. 3.8 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``సరైన సమయానికి కిందకు దిగకపోతే పడిపోవడం ఖాయం``, ``ఈ వాహనాన్ని పార్క్ చేయడం ఎలా``, ``దాని మీద ఇద్దరు ప్రయాణం చేయవచ్చా``, ``ఈ వాహనం వల్ల ఉపయోగాలు ఏంటి``, ``ట్రాఫిక్‌లో దీనిని నియంత్రించడం సాధ్యమేనా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Ratan Tata: పీవీ నరసింహారావుకు రతన్ టాటా లేఖ.. ఆర్థిక సంస్కరణల గురించి ఏమన్నారంటే..
Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న చిన్న తప్పును 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..