AP Highcourt: ఎమ్మెల్యే ఆదిమూలంకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..
ABN , Publish Date - Sep 25 , 2024 | 11:39 AM
Andhrapradesh: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఈరోజు (బుధవారం) కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
అమరావతి, సెప్టెంబర్ 25: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు (MLA Koneti Adimulam) హైకోర్టులో (AP HighCourt) ఊరట లభించింది. ఎమ్మెల్యేపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఈరోజు (బుధవారం) కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇటీవల ఆదిమూలంపై తిరుపతి పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న ఆదిమూలంపై బలాత్కారం... బెదిరించి రేప్ చేయడంపై కేసు నమోదు అయ్యింది. సెప్టెంబర్ 5న రాత్రి 11:15 గంటలకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే ఈస్ట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. సంఘటన జరిగిన బీమాస్ పారడైజ్ హోటల్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఆ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
Harsha Sai: హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్.. యువతి పట్ల ఎంత నీచంగా ప్రవర్తించాడంటే..
కేసులో ట్విస్ట్
అయితే... తనను ఎమ్మెల్యే ఆదిమూలం పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడ్డారని అందుకు సంబంధించిన వీడియో టేపులను మీడియాకు విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన కేవీబీపురం మండలానికి చెందిన బాధిత మహిళ చివరకు ఆయనతో రాజీ పడినట్లు సమాచారం. తనను ఎమ్మెల్యే ఆదిమూలం లైంగికంగా వేధించాడని తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన ఆమె శుక్రవారం (సెప్టెంబర్ 20) హైకోర్టుకు హాజరై ఎమ్మెల్యేపై తాను పెట్టిన కేసు, అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని నివేదించడం గమనార్హం. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం గత శుక్రవారం విచారణ చేపట్టింది. ఆదిమూలం తరపున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు.
ఆదిమూలంపై పోలీసులు పెట్టిన కేసులో సెక్షన్లు వర్తించవని, మహిళా పోలీసు అధికారిణి నమోదు చేయాల్సిన కేసును పురుష పోలీసు అధికారి నమోదు చేశారని, జూలై, ఆగస్టు నెలల్లో సంఘటన జరిగితే సెప్టెంబరు 5న కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా మూడవ వ్యక్తి ప్రమేయంతోనే మహిళ కేసు పెట్టిందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టి వేయాలని కోరారు. మరోవైపు బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అంశాలన్నీ అవాస్తవమని, ఈ మేరకు నోటరీతో కూడిన అఫిడవిట్‌ను బాధిత మహిళ కోర్టుకు సమర్పించిందని, అందువల్ల ఈ కేసును కొట్టి వేయాలని మహిళ తరఫు న్యాయవాది జితేందర్ సైతం కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృష్ణసాగర్ తీర్పును నేటికి తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు ఆదిమూలంపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
Jaggareddy: లడ్డు వివాదం వెనక ఉంది బీజేపీనా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
అసలేం జరిగిందంటే..
కాగా.. సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై.. పార్టీకి చెందిన మహిళ కార్యకర్త లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బాధితురాలు రిలీజ్ చేసింది. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బాధితురాలు, తన భర్తతో కలిసి వచ్చి ఆదిమూలం లైంగిక వేధింపుల పర్వాన్ని బయటపెట్టింది. తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని బాధితురాలు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశానని తెలిపింది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆదిమూలం తనపై బెదిరింపులకు దిగాడని బాధితురాలు చెప్పింది. తాము కూడా టీడీపీకి చెందిన వారమేనని ఆమె తెలిపింది.
హైకమాండ్ సీరియస్
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ హైకమాండ్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ హైకమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘వివిధ మాద్యమాలలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించారని వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది’’ అని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. ఆదిమూలం వ్యవహారంపై సీనియర్ నేతలు చంద్రబాబుకు తెలియజేయగా... బాబు సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి భయపడేలా ఆచర్యలు ఉండాలని ఆదేశించారు. అనంతరం గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు
Pit Bull: హీరో మాదిరిగా వచ్చి పాముతో పోరాడి చిన్నారి ప్రాణాలను కాపాడిన పిట్ బుల్
Read Latest AP News And Telugu News