CM Chandrababu: అధికారంలోకి వచ్చాం కదా అని అలసత్వం వద్దు..
ABN , Publish Date - Jul 13 , 2024 | 02:16 PM
Andhrapradesh: పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వం నేతలు వీడాలన్నారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలని తెలిపారు. ప్రతీ రోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అమరావతి, జూలై 13: పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చేశాం అనే అలసత్వం నేతలు వీడాలన్నారు. మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి తరచూ రావటం సేవగా భావించాలని తెలిపారు. ప్రతీ రోజూ ఇద్దరు మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రుల్ని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చే బాధ్యత జోనల్ ఇన్‌చార్జ్‌లు తీసుకోవాలని సీఎం తెలిపారు.
Chandrababu : ‘నా కాళ్లకు దండం పెట్టొద్దు’.. ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి
అలా చేస్తే వాళ్లకు మనకు తేడా ఏంటి?
ప్రజలు, కార్యకర్తల నుంచి వచ్చే వినతుల్ని స్వీకరించి వాటి పరిష్కరించేందుకు మంత్రులంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు, విజ్ఞాపనలు స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ నేతలు ఎవ్వరూ వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దని స్పష్టం చేశారు. ‘‘వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే... వారికీ మనకూ తేడా ఉండదు’’ అని అన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Anant Ambani: అనంత్ అంబానీ మళ్లీ బరువు ఎందుకు పెరిగాడు? 108 కిలోలు తగ్గిన తర్వాత ఏం జరిగింది..?
వారి సంగతి తేలుద్దాం...
గత 5 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులపై ఈ సందర్భంగా సీఎం ఆరా తీశారు. చట్టపరంగానే వారికి కేసుల నుంచి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై ముఖ్యమంత్రి చర్చించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని ఆదేశించారు. తెలుగుదేశం నేతలు, ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైసీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని విచారణ అధికారుల వివరాలు ఇవ్వాలన్నారు. చట్టపరంగానే వారి సంగతి తేలుద్దామని తెలిపారు.
Congress: దమ్ముంటే షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జగన్‌కు సవాల్
వారికే నామినేటెడ్ పదవులు...
సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి గురించి ఐదు విధాలుగా సమాచార సేకరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో, పార్లమెంట్ కోఆర్టినేటర్, నియోజకవర్గ పరిశీలకుడితో పాటు ఐవీఆర్ఎస్ ద్వారానూ సమాచార సేకరణ చేస్తున్నామన్నానరు. నివేదికలు త్వరగా పంపాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, బోండా ఉమా, ఎమ్మెల్సీలు అశోక్ బాబు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవిరావు, జోనల్ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
AP Govt: సోమశిల డ్యామ్‌ను కాపాడేందుకు కూటమి సర్కార్ కసరత్తు...
Congress: బీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా.. కాంగ్రెస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు..!?
Read Latest AP News And Telugu News