Share News

Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్ గూటికి గాంధీ

ABN , Publish Date - Jul 13 , 2024 | 11:42 AM

Telangana: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి... ఇప్పుడు ఎమ్మెల్యేలు చేజారిపోతుండటం ఆ పార్టీని పెను అగాధంలోకి నెట్టేసినట్టు అవుతోంది. వరుసగా గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకీ గుడ్‌బై చెప్పేయడం అధినేతకు మింగుడుపడని విషయంగా మారింది. నిన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్‌ఎస్‌కు బై బై చెప్పేయగా.. నేడు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కారు పార్టీకి టా టా చెప్పేశారు.

Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్‌.. కాంగ్రెస్ గూటికి గాంధీ
BRS MLA Arikapudi Gandhi Congress

హైదరాబాద్, జూలై 13: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి(BRS)... ఇప్పుడు ఎమ్మెల్యేలు చేజారిపోతుండటం ఆ పార్టీని పెను అగాధంలోకి నెట్టేసినట్టు అవుతోంది. వరుసగా గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకీ గుడ్‌బై చెప్పేయడం అధినేతకు మింగుడుపడని విషయంగా మారింది. నిన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్‌ఎస్‌కు బై బై చెప్పేయగా.. నేడు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ (MLA Arikapudi Gandhi) కారు పార్టీకి టా టా చెప్పేశారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)సమక్షంలో ఎమ్మెల్యే గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Congress: నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే


Arikepudi.jpg

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , చందానగర్ కార్పొరేటర్ మంజుల, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. అరికపూడి గాంధీ కలిపి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్, సంజయ్‌, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్ ఇలా వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్న నేపథ్యంలో మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా అధినేత కేసీఆర్ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Arikepudi-2.jpg


ఇవి కూడా చదవండి..

Chandrababu: సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహ వేడుకకు చంద్రబాబు

Lavanya: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఆత్మహత్య లేఖ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 13 , 2024 | 12:21 PM