Share News

CM Chandrababu: బెజవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ABN , Publish Date - Oct 08 , 2024 | 10:36 AM

Andhrapradesh: ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం...

CM Chandrababu: బెజవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 8: రాజస్థాన్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న మృతిచెందడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Tirumala Laddu: శ్రీవారి నెయ్యి నాణ్యతపై 1019లోనే విచారణ.. తేడా వచ్చిందో..


కాగా.. బెజవాడ బార్ అసోసియేషన్ నిర్వహించిన టూర్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్ళే మార్గంలో వీరు ప్రయాణించిన బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రముఖ న్యాయవాది, అఖిల భారత లాయర్ల సంఘం ప్రధాన కార్యదర్శి సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే సుంకర రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి స్థానిక అధికారులు తరలించారు. ఈ ప్రమాదంలో సుంకర రాజేంద్ర ప్రసాద్‌కు కంటి మీద గాయాలు అయ్యాయి.

Elections: హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..


మరోవైపు రాజస్థాన్‌లో జరిగిన బస్ ప్రమాదం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, కేంద్ర మంత్రుల దృష్టికి టీడీపీ నేత, సీనియర్ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తీసుకువెళ్ళారు. వెంటనే ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌ను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది. అజ్మీర్ కలెక్టర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, రాజస్థాన్ చీఫ్ సెక్రటరీలతో ఏపీ ఉన్నతాధికారులు మాట్లాడారు. తీవ్రంగా గాయపడిన వారిని అజ్మీర్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. సీనియర్ న్యాయవాది ఎస్‌ఆర్‌పీకి బలమైన గాయాలు అయ్యాయని.. ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

mother: పాప కోసం..అమ్మ వచ్చేసింది..!

తమ్ముళ్లూ.. ఇది తగదు!

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2024 | 10:40 AM