CM Chandrababu: ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 26 , 2024 | 09:37 AM
Andhrapradesh: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో,ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను’’..
అమరావతి, ఆగస్టు 26: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి (krishnashtami Festival) పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అని అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో,ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. .
నందగోపాలుని ఆశీస్సులతో: లోకేష్
మంచిని కాపాడటానికి, చెడును అంతమొందించటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించారని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. చిన్ని కృష్ణుని జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దైవమై రక్షిస్తూ, గురువులా నేర్పిస్తూ, స్నేహితుడై వెన్నంటి నిలుస్తున్న నందగోపాలుని ఆశీస్సులతో ప్రజలంతా ఆనందమయ జీవితం గడపాలని ప్రార్థిస్తున్నాను అని లోకేష్ అన్నారు.
ప్రజలను ఏకం చేసే పండుగ: జగన్
రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఆథ్యాత్మికంగా శక్తినిచ్చే ఈ పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయం. మనందరిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
మరోవైపు దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శ్రీ కృష్ణుడి ఆలయాల ముందు భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణ, ఏపీలోని అన్ని జిల్లాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.హైదరాబాద్‌లో ప్రముఖ ఇస్కాన్ టెంపుల్, హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్, శ్రీ రాధాకృష్ణ దేవాలయం తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చిన్ని కృష్ణయ్యకు ప్రీతిపాత్రమైన పాలు, నెయ్యి, వెన్నె తదితర ఆహారపదార్థాలను నైవేథ్యం సమర్పించడానికి క్యూ కట్టారు.
ఇవి కూడా చదవండి...
Peddireddy: అటవీ శాఖ.. పెద్దిరెడ్డి ఇలాకా!.
Grama Sachivalayam: సచివాలయాల సిబ్బంది సర్దుబాటు!
Read Latest AP News And Telugu News