Share News

Python: విశాఖ గంగవరం పోర్టులోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన కార్మికులు..

ABN , Publish Date - Aug 26 , 2024 | 08:04 AM

గంగవరం పోర్టు(Gangavaram Port)లోకి భారీ కొండచిలువ(Python) ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Python: విశాఖ గంగవరం పోర్టులోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన కార్మికులు..

విశాఖ: గంగవరం పోర్టు(Gangavaram Port)లోకి భారీ కొండచిలువ(Python) ఎంట్రీ ఇచ్చింది. దాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సురక్షితంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.


అసలేం జరిగిందంటే..?

గంగవరం పోర్టులో రోజూ మాదిరిగానే కార్మికులంతా ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. పొద్దుపోవడంతో కాస్త చీకటి పడింది. ఓ కార్మికుడు పని చేసుకుంటున్న సమయంలో ఆ ప్రాంతంలోకి సడెన్‌గా కొండచిలువ వచ్చింది. దాన్ని చూసిన అతడు గట్టిగా కేకలు వేస్తూ భయంతో పరుగులు తీశాడు. కంగారు పడ్డ తోటి కార్మికులు విషయం అడ్డగా కొండచిలువను చూసినట్లు చెప్పాడు. వారంతా అక్కడికి వెళ్లడంతో అది నిదానంగా వెళ్తోంది. అప్పటికే ఏదో ఆహారం పొట్టనిండా తినడంతో మెల్లిగా కదులుతోంది. కొండచిలువ భారీ ఉండడంతో దాన్ని పట్టుకునేందుకు ఎవ్వరూ సాహసం చేయలేకపోయారు. దీంతో స్నేక్ క్యాచర్ కిరణ్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అతను చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు. అనంతరం అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టాడు. దీంతో గంగవరం పోర్టు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Aug 26 , 2024 | 08:05 AM