Tirumala Laddu: తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యి వాడకం ఓ మాజీ అధికారి పుణ్యమే: ఓవీ రమణ
ABN , Publish Date - Sep 19 , 2024 | 01:02 PM
Andhrapradesh: జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి బట్టర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించారని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు ఓవి రమణ అన్నారు. ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డూలలో నాసి రకం నెయ్యి వాడడానికి కారణమని మండిపడ్డారు.
తిరుపతి, సెప్టెంబర్ 19: తిరుమల లడ్డూలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్నీ నిజాలే అని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు ఓవీ రమణ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి బట్టర్ ఆయిల్ దిగుమతి చేసుకుని శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించారన్నారు. ఒక మాజీ అధికారి పుణ్యమే లడ్డూలలో నాసి రకం నెయ్యి వాడడానికి కారణమని మండిపడ్డారు. నిజాలు మాట్లాడిన చంద్రబాబుపై టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల విమర్శలు సరికాదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి విలువ ల్లేని వ్యక్తి అని మండిపడ్డారు. టీటీడీని భ్రష్టు పట్టించింది కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డిలే అని వ్యాఖ్యలుు చేశారు.
YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!
తిరుమలలో కోట్లాది రూపాయలతో ల్యాబ్‌లు ఉన్నా, వీళ్ల గుట్టుబయటపడకూడదనే గత ప్రభుత్వంలో టెక్నీషియన్లను కావాలనే నియమించలేదన్నారు. దేశంలో కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో మాత్రమే ఆవు నెయ్యి అందుబాటులో ఉందన్నారు. వైసీపీ హయాంలో నెయ్యి సరఫరాలో అనుభవం లేని ఇతర రాష్ట్రాల్లోని ట్రేడర్ల నుంచి నెయ్యి కొనుగోలు చేయడం కమిషన్ల కోసమే అని ఆరోపించారు. దేశంలోనే సమర్థవంతమైన సీఎం చంద్రబాబు ఒక్కరే అని అన్నారు. అనుభవం ఉన్న నాయకుడు కాబట్టే వరదల నుంచి బాధితులకు వెంటనే ఉపశమనంకలిగేలా చేశారన్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే వరద బాధితులకు విరివిగా దాతలు విరాళాలు ఇచ్చారన్నారు. గోలిషోడాలమ్ముకున్న అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు కూడా సీఎంను విమర్శించడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ శాఖ గురించే తెలియదన్న అంబటి రాంబాబు వరదలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ ఓవీ రమణ వ్యాఖ్యలు చేశారు.
HYDRA: హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్‌సాగర్‌లో నిర్మాణాలేనా..
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే..
తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం నుంచి నిత్యాన్న ప్రసాదం వరకు అన్నింటినీ సర్వనాశనం చేశారని తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉపయోగించి తయారు చేయాల్సిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వును కలిపారని చెప్పారు. ‘‘తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా మార్చేశారు. ఎన్ని ఫిర్యాదుల చేసినా శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అయినా.. తిరుమలలో చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. చివరకు అన్న ప్రసాదంలోనూ నాణ్యత లేకుండా చేశారు. సాక్షాత్తూ స్వామి దగ్గర పెట్టే ప్రసాదం కూడా అపవిత్రం చేశారు. నాసిరకం సరుకులే కాకుండా, లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. ఈ రోజు స్వచ్ఛమైన నెయ్యి తెమ్మన్నాం. ప్రక్షాళన చేయమని చెప్పాం. ఇప్పుడు నాణ్యత పెరిగింది. ఇంకా నాణ్యత పెంచుతాం. వేంకటేశ్వరస్వామి మనరాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఆయన కోసం ప్రపంచం మొత్తం మన దగ్గరకి వస్తోంది. అలాంటప్పడు తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని చంద్రబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి...
Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..
Dola Anjaneyulu: పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా జగన్ పాపాలు బయటకు....
Read LatestAP NewsAndTelugu News