AP Govt: ఫైబర్ నెట్ మాజీ ఎండీపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:46 PM
Andhrapradesh: ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ కార్పోరేషన్‌లో అవినీతిని కప్పి పుచ్చుకునేలా మధుసూధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని కూటమి సర్కార్ జీవోలో పేర్కొంది.
అమరావతి, ఆగస్టు 19: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై (Former Fibernet MD Madhusudan Reddy) సస్పెన్షన్ వేటు పడింది. మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సోమవారం నాడు ప్రభుత్వం (AP Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ నెట్ కార్పోరేషన్‌లో అవినీతిని కప్పి పుచ్చుకునేలా మధుసూధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని కూటమి సర్కార్ జీవోలో పేర్కొంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు నమోదు అయ్యాయి.
CM Revanth: బాలికకు అండగా నిలిచిన సీఎం రేవంత్.. ఇదీ కథ.!!
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులను ఉద్యోగుల నియామకం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. సాక్ష్యాలను ధ్వంసం చేస్తున్నారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మధుసూధన్ రెడ్డి కేంద్ర సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పేర్కొన్న ప్రభుత్వం.. హెడ్ క్వార్టర్సు విడిచి వెళ్లకూడదని స్పష్టం చేస్తూ జీవో జారీ చేసింది.
TGSRTC: ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ
పలువురు ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూర్చేలా మధుసూదన్ రెడ్డి వ్యవహరించారంటూ ప్రభుత్వం జీవోలో పేర్కొంది. కాగా.. ఫైబర్ నెట్ కార్పోరేషనులో రూ. 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ఏపీ సర్కార్‌కు ఫిర్యాదులు వెల్లువెల్తాయి. ఈ క్రమంలో ఫైబర్ నెట్‌లో జరిగిన అక్రమాలపై పూర్తి విచారణకు ఆదేశించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Kitchen Tips: కిచెన్ టవల్ దుర్వాసన వస్తోందా? ఈ టిప్స్ పాటించి చూడండి..!
YS Sharmila: ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ శుభాకాంక్షలు
Read Latest AP News And Telugu News