Share News

CM Revanth: బాలికకు అండగా నిలిచిన సీఎం రేవంత్.. ఇదీ కథ.!!

ABN , Publish Date - Aug 19 , 2024 | 03:27 PM

Telangana: ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదు. అప్పటి వరకు తల్లిచాటు బిడ్డగా ఎదిగిన ఆ చిన్నారికి ఒక్కాసారిగా లోకం చీకటిగా మారిపోయింది. ఉన్న ఒక్క బంధం కూడా తెగిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది 11 ఏళ్ల బాలిక. కన్న తల్లి చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ‘‘నేనున్నానంటూ’’ బాసటగా నిలిచారు.

CM Revanth: బాలికకు అండగా నిలిచిన సీఎం రేవంత్.. ఇదీ కథ.!!
CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 19: ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదు. అప్పటి వరకు తల్లిచాటు బిడ్డగా ఎదిగిన ఆ చిన్నారికి ఒక్కసారిగా లోకం చీకటిగా మారిపోయింది. ఉన్న ఒక్క బంధం కూడా తెగిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయింది 11 ఏళ్ల బాలిక. కన్న తల్లి చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాలికకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ‘‘నేనున్నానంటూ’’ బాసటగా నిలిచారు. బాలికకు అన్ని విధాలుగా అండ‌గా నిల‌వాల‌ని క‌లెక్ట‌ర్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌తో ఒంట‌రిగా మిగిలిపోయిన బాలిక దుర్గ‌కు అన్ని విధాలా అండ‌గా నిలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌క‌టించారు.

TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ


నిర్మ‌ల్ జిల్లా తానూర్ మండ‌లం బేల్‌త‌రోడా గ్రామానికి చెందిన ఒంట‌రి మ‌హిళ మేర గంగామ‌ణి (36) శ‌నివారం రాత్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథ‌గా మిగిలింది. త‌ల్లి అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బులేక‌పోవ‌డంతో దుర్గ భిక్షాట‌న చేసింది. విష‌యం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావ‌డంతో ఆయ‌న వెంట‌నే స్పందించారు. బాలిక‌కు విద్యా,వైద్య‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు అండ‌గా నిల‌వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ అభిన‌వ్‌ను ముఖ్య‌మంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేర‌కు బాలిక‌కు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠ‌శాల‌లో చేర్చుతామ‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. వైద్యం, ఇత‌ర స‌మ‌స్య‌లేమైనా ఉంటే వాటిని వెంట‌నే ప‌రిష్క‌రిస్తామ‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

TGSRTC: బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ

Rakhi Festival: సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మహిళానేతలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 19 , 2024 | 03:30 PM