Devineni: ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూదందా
ABN , Publish Date - Jul 31 , 2024 | 10:49 AM
Andhrapradesh: ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ పేరుతో గత ప్రభుత్వ పెద్దలు చేసిన భూదందాలపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... లక్షలాది ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, చుక్కల భూములు కొల్లగొట్టారని మండిపడ్డారు.
అమరావతి, జూలై 31: ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్ పేరుతో గత ప్రభుత్వ పెద్దలు చేసిన భూదందాలపై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister Devineni Umamaheshwar Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) భూబాగోతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... లక్షలాది ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, చుక్కల భూములు కొల్లగొట్టారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులు వారికి తెలియకుండానే స్వాహా చేశారని తెలిపారు.
Madanapalle Incident: మదనపల్లె ఘటనలో కీలక పరిణామం.. ఆ ఎనిమిది కేసులు ఎవరిపైనో..!?
ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ముసుగులో భారీ భూదందాకు తెగబడ్డారని విరుచుకుపడ్డారు. చట్టానికి తూట్లు పొడిచేలా పరిశీలన వ్యవధి రెండు రోజుల నుంచి గంటకు తగ్గించారన్నారు. ఎనిమిది నెలల్లో రెండు 2 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జరిగిన భూ లావాదేవీలపై సమగ్ర విచారణ చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా మహేశ్వరరావు కోరారు.
YSRCP: వైసీపీ కోసం పని చేసిన డీఎస్పీల సస్పెన్షన్..
ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అంటే...
ఒక ప్రాంతంలో ఉన్న ఆస్తిని మరో ప్రాంతంలోని సబ్‌రిజిస్టర్ కార్యాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విధానమే ఎనీవేర్ రిజిస్ట్రేషన్. కానీ, ప్రజల చేతుల్లోని భూములను వైసీపీ పెద్దలు, ఆ పార్టీ స్థానిక నాయకులు తమ పేర్ల మీదకు బదలాయించుకునేందుకు ఈ విధానాన్ని యథేచ్ఛగా వాడేశారు. నిషేధ జాబితాలోని ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, దేవదాయ భూములనే గత ప్రభుత్వ పెద్దలు లాగేసుకున్నారని అనుకున్నారు... కానీ జనం భూములు, ఆస్తులు కూడా ‘ఎనీవేర్’ ముసుగులో కొల్లగొట్టారని ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దీంతో జనం ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై దండెత్తుతున్న పరిస్థితి.
అయితే.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని 2015లో చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ విధానంలో విజయవాడలోని గుణదల పరిధిలో ఉన్న ఆస్తిని ఒంగోలు సబ్‌రిజిస్టార్ కార్యాలయ పరిధిలో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒంగోలు సబ్‌రిజిస్టార్ కార్యాలయం నుంచి ఆ ఆస్తి తాలూకు డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు, ఇరుపార్టీలకు చెందిన ఇతర సర్టిఫికేట్లన్నింటినీ గుణదల సబ్‌రిజిస్టార్‌కు పంపుతారు. ఆ వివరాలు సరైనవో, కావోనని చెప్పడానికి 48 గంటల సమయం ఇస్తారు. సరైనవే అయితే ఒంగోలులో రిజిస్ర్టేషన్ జరిగిపోతుంది. ఒకవేళ ఏవైనా వివాదాలుంటే దాన్ని పెండింగ్‌లో పెడతారు.
Pawankalyan: పవన్ సారూ.. మీరే దిక్కు!
అయితే.. జగన్ మాత్రం డాక్యుమెంట్ల పరిశీలన వ్యవధిని కేవలం ఒక గంటకు తగ్గించారు. పైగా ఆ ఆస్తి ఉన్న ప్రాంతం సబ్‌రిజిస్టర్‌కు డాక్యుమెంట్లు పంపరు. ఏ ప్రాంతంలోని భూమి, సర్వే నెంబర్ లాంటి కొన్ని వివరాలను ఒక ఫారంలో నింపి పంపుతారు. అసైన్డ్, నిషేధిత జాబితాలోని భూములైతే ఈ విధానంలో తెలుసుకోవచ్చు. కానీ, గ్రామకంఠాలకు రికార్డులుండవు. ఈ విధానంలో కేవలం ఒక గంటలో వాటిని గుర్తించడం అసాధ్యం. లింకు డాక్యుమెంట్లు, ఇతర సంబంధిత సర్టిఫికెట్లు ఏవీ ఉండకపోవడంతో ఎవరి భూమిని ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్న విషయం కూడా సబ్‌రిజిస్ట్రార్లకు తెలీదు. పైగా గంటలో ఓకే చేయాలి. ఓకే చేయకపోతే ఆ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో సేవలు నిలిచిపోతాయి. ప్రజలు సబ్‌రిజిస్టార్లపై ఒత్తిడి పెంచుతారు. దీంతో ఏ వివరాలు తెలియకపోయినా సరే తప్పనిసరిగా ఆ ఎనీవేర్ ప్రతిపాదనలకు సబ్‌రిజిస్టార్లు ఓకే చేయాల్సిన తప్పని పరిస్థితిలోకి గత ముఖ్యమంత్రి నెట్టేశారు.
గత ఐదేళ్లు ఎనీవేర్ రిజిస్ట్రేషన్‌ను అప్పటి ప్రభుత్వ పెద్దలు, నేతలు అడ్డదిడ్డంగా వాడేసినట్లు తెలుస్తోంది. జనాల భూములకు చెందిన 2 లక్షల డాక్యుమెంట్లకు నాటి ప్రభుత్వ పెద్దలు ఎనిమిది నెలల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించేసుకున్న పరిస్థితి. తమ భూములు తమకు తెలీయకుండా వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాయని తెలుసుకున్న బాధితులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పరుగులుపెడుతున్నారు. దూరంగా ఉన్న వారు మెయిల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం దృష్టిసారించి అక్రమాలు సరిదిద్దకపోతే గ్రామాల్లో యుద్ధవాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి...
Congress Government : మూడో విడత రుణమాఫీ.. రెండు దఫాల్లో!
CM Chandrababu: కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
Read Latest AP News And Telugu News