Share News

CM Chandrababu: కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:25 AM

Andhrapradesh: కీలక శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష జరుపనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలను సీఎం సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి, అధికారులతో చర్చించనున్నారు. గత ప్రభుత్వం అసంబద్ధ విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

CM Chandrababu: కీలక శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
CM Chandrababu Naidu

అమరావతి, జూలై 31: కీలక శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు సమీక్ష జరుపనున్నారు. పరిశ్రమలు, ఎక్సైజ్ శాఖలను సీఎం సమీక్షించనున్నారు. పరిశ్రమలు, పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి, అధికారులతో చర్చించనున్నారు. గత ప్రభుత్వం అసంబద్ధ విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం (AP Government) ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై సమీక్షించే అవకాశం ఉంది.

Pawankalyan: పవన్‌ సారూ.. మీరే దిక్కు!


అక్టోబర్ నాటికి మద్యం కొత్త పాలసీ రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పాత విధానంలో ఉన్న లోపాలను సరి చేయాలా..? లేక ప్రైవేట్ మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా..? అనే అంశంపైనా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, హోలో గ్రామ్ స్టిక్కర్ల స్కాంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు.


గిరిజన సంక్షేమ శాఖపై..

కాగా... నిన్న గిరిజన సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో నేడు ఉన్న పరిస్థితులపై సమావేశంలో చర్చ జరుగింది. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. గత ప్రభుత్వానికి గిరిజన సంక్షేమమనేది అత్యంత అప్రధాన్యత శాఖగా చూసిందని అధికారులు వెల్లడించారు. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అధికారులు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. అలాగే గిరిజనులకు సత్వర వైద్యం కోసం తెచ్చిన పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిన విధానంపై సీఎం సమీక్ష జరిపారు. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, అరకు కాఫీ మార్కెటింగ్, ఇతర గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Landslides: కొండ చరియల ప్రమాదాన్నీ పసిగట్టవచ్చు


హోలో గ్రామ్‌లో భారీ స్కామ్

నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికి 13 కోట్ల 68 లక్షల మద్యం, బీరు బాటిళ్లకు హోలో గ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా చేసేందుకే టెండర్లను పక్కదారి పట్టించినట్టు అనుమానాలు ఉన్నాయి. హోలో గ్రామ్ టెండర్లపై విజిలెన్సు విచారణలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలో గ్రామ్‌ల పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లకు వేసే హోలో గ్రామ్ టెండర్లను కట్టబెట్టినట్టు తెలుస్తోంది. ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే హోలో గ్రామ్ కంపెనీలకు బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇష్టానుసారం టెండర్లు కట్టబెట్టారని... జీఎస్టీ లావాదేవీల సమాచారం, గతంలో చేసిన వ్యాపారం వివరాలు లేకుండానే టెండర్లు కట్టబెట్టేసినట్టు విజిలెన్సు బయటపడ్డ వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హోలో గ్రామ్ టెండర్లకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతైనట్టు విచారణలో వెల్లడైంది. టెండర్ల ఖరారు ప్రక్రియలో సాంకేతిక కమిటీ నివేదికపై అధికారిక సంతకాలు లేనట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సాంకేతిక కమిటీ సమావేశం మినిట్స్ కూడా కనిపించకుండా మాయం చేసినట్టు అధికారులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి...

‘ఎనీవేర్‌’.. భూముల చోర్‌!

Congress Government : మూడో విడత రుణమాఫీ.. రెండు దఫాల్లో!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 31 , 2024 | 09:28 AM