Home Minister Anitha: వాటిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధం అవుతున్నాం: హోంమంత్రి అనిత..
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:49 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు రిస్క్ తగ్గింపుపై మూడ్రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై వివిధ శాఖల అధికారులకు మూడ్రోజులపాటు అవగాహన కల్పించునున్నారు.
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఎటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినా ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధం అవుతున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) చెప్పారు. విజయవాడను బుడమేరు వరదలు ముంచెత్తినప్పుడు ఎన్ఐడీఎమ్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఆమె చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సౌత్ క్యాంపస్‌ను హోంమంత్రి అనిత సందర్శించారు.
AP Highcourt: సజ్జల భార్గవ పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపత్తు రిస్క్ తగ్గింపుపై మూడ్రోజులపాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై వివిధ శాఖల అధికారులకు మూడ్రోజులపాటు అవగాహన కల్పించునున్నారు. బుడమేరు వరదలు, హుద్ హుద్ తుపాను, ఇతర విపత్తులను సీఎం చంద్రబాబు సారథ్యంలో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని హోంమంత్రి అనిత చెప్పారు. సముద్రంలో వేటగాళ్లను అప్రమత్తం చేసే సాంకేతిక పరికరాలను గత వైసీపీ ప్రభుత్వం మూలన పడేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేయడం ద్వారా మత్స్యకారుల ప్రాణాలకు హాని పొంచి ఉందని అనిత చెప్పారు.
Volunteers: మాట ఇచ్చి మోసం చేస్తారా.. వాలంటీర్ల ఆగ్రహం
రాష్ట్రంలో ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేలా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని శాఖల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అనిత అన్నారు. విపత్తు నిధుల గురించి ఎన్డీయే ప్రభుత్వంలో ఏమాత్రం డోకా లేదని ఆమె చెప్పారు. ఎన్ఐడీఎమ్ వంటి సంస్థలు ఇస్తున్న శిక్షణను అన్ని శాఖల అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రమాద అంచనా, ముందస్తు అవగాహన, విపత్తులు సంభవించినప్పుడు స్పందనపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Machilipatnam: వైసీపీ నేత పేర్ని నాని సతీమణి కేసు విచారణ వాయిదా.. ఎందుకంటే..
CM Chandrababu: నేను అన్ని డెడ్‌లైన్లు పూర్తి చేశా.. కానీ విధి డెడ్‌లైన్ మార్చింది