Share News

PVP: ప్రాజెక్టులు చేపట్టేందుకు మేమూ సిద్ధం...

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:12 PM

Andhrapradesh: విజయవాడలో పీవీపీ మాల్ పదేళ్ల వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని పీవీపీ మాల్ అధినేత, పారిశ్రామిక వేత్త పొల్లూరి వరప్రసాద్ అన్నారు. పీవీపీ మాల్ పదో వార్షికోత్సవంలో పాల్గొన్న పీవీపీ మాట్లాడుతూ... విజయవాడ మరింత అభివృద్ధి చెందాలని ఈ ప్రాంత వాసిగా కోరుకుంటున్నానన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నాయని తెలిపారు.

PVP: ప్రాజెక్టులు చేపట్టేందుకు మేమూ సిద్ధం...
Potluri Varaprasad

విజయవాడ, ఆగస్టు 1: విజయవాడలో (Vijayawada) పీవీపీ మాల్ పదేళ్ల వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని పీవీపీ మాల్ అధినేత, పారిశ్రామిక వేత్త పొల్లూరి వరప్రసాద్ (Potluri Varaprasad) అన్నారు. పీవీపీ మాల్ పదో వార్షికోత్సవంలో పాల్గొన్న పీవీపీ మాట్లాడుతూ... విజయవాడ మరింత అభివృద్ధి చెందాలని ఈ ప్రాంత వాసిగా కోరుకుంటున్నానన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్ యథాతథంగా అమలు చేస్తే అభివృద్ధికి అవకాశాలుంటాయన్నారు.

SC sub-categorisation: నాడు చంద్రబాబు చొరవతో.. నేడు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌తో.. ఎస్సీ వర్గీకరణ అసలు చరిత్ర ఇదే..!


వచ్చే ఐదేళ్లలో రాజధాని అమరావతి విశేషంగా అభివృద్ది చెందుతుందని తెలిపారు. రాజధాని అభివృద్దిలో తామూ భాగస్వామ్యం అవుతామని వెల్లడించారు. పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు పారుశ్రామికవేత్తలతో పాటు తామూ సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. అమరావతిలో గతంలోనే పలు పారిశ్రామిక సంస్థలకు ల్యాండ్ అలోకేట్ చేశారన్నారు. వాటన్నింటినీ కొనసాగించి, మౌలిక వసతులు కల్పిస్తే అభివృద్ది పరుగులు పెడుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతం ఆటోమేటిక్‌గా పారిశ్రామికంగా అభివృ ద్ది చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

Chinta mohan: ఏపీ అప్పులపై నిజనిర్ధారణ కమిటీకి చింతామోహన్ డిమాండ్


అమరావతి అభివృద్ది చెందితే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే వయబిలిటీ ఫండింగ్‌లో గ్యాప్ ఉందన్నారు. వయబిలిటీ ఫండ్ గ్యాప్ రాకుండా చూస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

కాగా.. తన రాజకీయ ప్రస్తానంపై జర్నలిస్టులు ప్రశ్నలు అడుగగా.. అందుకు సమాధానం ఇవ్వకుండా పీవీపీ దాటవేశారు. రాజకీయాల గురించి ప్రస్తుతం మాట్లాడనని పొట్లూరి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Free Sand Policy: ఇసుకలో ఎందుకీ గందరగోళం?

Venkataprasad: 55 రోజుల్లో రెండోసారి పెన్షన్ పంపిణీతో ప్రజల్లో ఆనందం...

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 01 , 2024 | 04:59 PM