Game Changer movie: 'గేమ్ ఛేంజర్' మూవీపై కీలక అప్డేట్
ABN , Publish Date - Dec 29 , 2024 | 06:15 PM
Game Changer movie: రాంచరణ్ నట విశ్వరూపాన్ని గేమ్ ఛేంజర్ సినిమాలో తప్పకుండా చూస్తారు అని ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజ్ తెలిపారు. వరల్డ్ రికార్డుగా 256 అడుగుల కటౌట్ పెట్టిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
విజయవాడ: విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్‌లో గ్లోబల్ స్టార్ రాంచరణ్ 256 అడుగుల భారీ కటౌట్‌ను ఇవాళ(ఆదివారం) ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా అభిమానులు పుష్పాభిషేకం చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. మెగా అభిమానులకు షీల్డ్‌లను దిల్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. గేమ్ ఛేంజర్ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గేమ్ ఛేంజర్ ట్రయలర్‌ను బట్టి సినిమాను అంచనా వేస్తున్నారని చెప్పారు. జనవరి 1వ తేదీన గేమ్ ఛేంజర్ సరికొత్త ట్రైలర్‌తో మీ ముందుకు వస్తున్నామని అన్నారు. రాంచరణ్ 256 అడుగుల భారీ కటౌట్ పెట్టి మెగా అభిమానులు చరిత్ర సృష్టించారని అన్నారు. సినీ రాజధానిగా , తెలుగు సినిమా పుట్టినిల్లు పేరు గాంచిన విజయవాడలో ఈ ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. సుప్రీంహీరో నుంచి మెగాస్టార్‌గా ఎదిగి.. మెగా బాస్‌గా ఒక్కరిగా నిలిచిన చరిత్ర చిరంజీవిదని చెప్పారు. మెగాస్టార్ కష్టం గురించి, ఆయన కృషి గురించి ఎంత మాట్లాడినా తక్కువేనని అన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను, తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ను మనకు అందించారని పేర్కొన్నారు. అల్లు అర్జున్, సాయిదుర్గా తేజ్, మనకు హీరోలుగా పరిచయం చేశారని దిల్‌రాజ్ వెల్లడించారు.
చరిత్ర సృష్టించేలా ఈవెంట్
‘‘వరల్డ్ రికార్డుగా 256 అడుగుల భారీ కటౌట్ పెట్టిన అభిమానులకు ధన్యవాదాలు. నేను విజయవాడకు వచ్చింది ఈ ఫంక్షన్‌తో పాటు, పవన్‌ను కలిసేందుకు వచ్చాను. అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించి.. వేడుక చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాను. ఆయన ఇచ్చే తేదీని బట్టి త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం. ఈసారి నిర్వహించే ఈవెంట్ ఒక చరిత్ర సృష్టించేలా ఉంటుంది. గేమ్ ఛేంజర్ విడుదల అయ్యాక... ఓజీ పబ్లిసీటికి షిప్ట్ అవుదాం. చిరంజీవికి ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి సినిమా చూడాలని కోరాను. సినిమా చూసిన చిరంజీవి నాకు ఫోన్ చేసి మూవీ చాలా బాగా నచ్చిందని తెలిపారు. సంక్రాంతికి మంచి హిట్ కొడుతున్నామని అభిమానులకు చెప్పాలని చిరంజీవి నాకు చెప్పారు. మెగా పవర్ స్టార్‌లో మెగాస్టార్‌ను చూస్తారు.. పవర్ స్టార్‌ను కూడా చూస్తారు. శంకర్ నాలుగేళ్ల క్రితం సినిమా కథ చెప్పినప్పుడు ఒక ఫీల్ వచ్చింది.ఇందాక చిరంజీవి సీన్ టూ సీన్ మాట్లాడుతుంటే.. నాకు చాలా ఆనందం వేసింది. రాంచరణ్ నట విశ్వరూపం ఈ సినిమాలో తప్పకుండా చూస్తారు’’ అని దిల్‌రాజ్ పేర్కొన్నారు.
కొత్త అనుభూతి..
‘‘ఐఏఎస్ , పోలీస్ ఆఫీసర్‌గా, ఒక పొలిటికల్ లీడర్‌గా ఉండాల్సిన లక్షణాలతో రాంచరణ్ కనిపిస్తారు. ఇక శంకర్ పాటలు కూడా బిగ్ స్క్రీన్‌పై కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఒకొక్క సాంగ్‌ను 10 నుంచి 15 రోజులు షూట్ చేశాం. ఏ పాటకు ఆ పాట విభిన్నంగా ఉంటూ అలరిస్తాయి. 2.45 గంటల నిడివిలో ఈ సినిమాను రూపొందించాం. తొలిసారిగా చిరంజీవికే ఈసినిమా చూపించాం.. ఆయన చాలా ఎంజాయ్ చేశారు. సూర్యతో చరణ్ ఉన్న సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి. పవన్‌కల్యాణ్ డేట్ ఇస్తే జనవరి 4 లేదా 5న ఏపీలో మెగా ఈవెంట్ నిర్వహిస్తాం. జనవరి 1న ట్రైలర్, 10న సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత పండుగను ఒక రేంజ్‌లో మనమంతా చేసుకుందాం’’ అని దిల్‌రాజ్ ప్రకటించారు.