Kollu Ravindra: ఫొటోగ్రఫీ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
ABN , Publish Date - Aug 19 , 2024 | 01:04 PM
ఫొటోగ్రఫీ రంగంలో రోజు రోజుకి పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫొటోగ్రాఫర్లకు రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాలు జరిగాయి.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఫొటోగ్రఫీ రంగంలో రోజు రోజుకూ పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫొటోగ్రాఫర్లకు రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. మచిలీపట్నంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సెంటర్‌లో ఉన్న కెమెరా సృష్టికర్త డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మచిలీపట్నం డివిజన్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ మణిపాల్ ఆస్పత్రి నిర్వాహకులు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లను మంత్రి రవీంద్ర ప్రారంభించారు.
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగాలి: ఎంపీ శివనాథ్
జల వనరుల శాఖ ఏపీలో మొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహించటం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం-2024 వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. జలవనరుల నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతికతను ఏకీకృతం చేయడంపై సమగ్ర స్థాయిలో చర్చలు జరగాలని సూచించారు. సహజ వనరుల పరిరక్షణ, ముఖ్యంగా జల వనరుల పర్యవేక్షణ , నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగాలని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.