Share News

Minister Nadendla: పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:01 PM

Andhrapradesh: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నాడు.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజా ప్రతినిధులకు శాలువా కప్పి, గిఫ్ట్ గా కూరగాయలు అందించి పవన్ సన్మానించారు.

Minister Nadendla: పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు
Minister Nadendla Manohar

అమరావతి, జూలై 15: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) అన్నారు. సోమవారం నాడు.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సత్కరించారు. ముందుగా మంత్రి నాదెండ్లను సత్కరించారు. ప్రజా ప్రతినిధులకు శాలువా కప్పి, గిఫ్ట్ గా కూరగాయలు అందించి పవన్ సన్మానించారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను జనసేన ప్రజా ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో ఉన్నామని... మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బంది.. మచ్చ రాకుండా అందరూ పని చేయాలని మంత్రి సూచించారు.

Vijayasai Reddy: అప్పుడు జగన్ వద్దన్నారని ఆగా.. ఇప్పుడు ఎవ్వరి మాటా వినను..


‘‘పదవులు మనకొచ్చాయి.. కానీ మనం కోసం పని చేసిన జనసైనికులు, వీర మహిళలను మరువద్దు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు.. తిప్పి కొట్టాలి. కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి. నిజాయితీగా పని చేయాలి. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేసింది. త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించనున్నాం. గతంలో తక్కువ సంఖ్యలోనే క్రియాశీలక సభ్యులను చేర్పించాం. ఇప్పటి వరకు సుమారు కార్యకర్తలకు ఆర్థిక సాయం కింద రూ. 18 కోట్లు అందించాం’’ అని చెప్పుకొచ్చారు.

Ponguleti Srinivasa Reddy: రూ.7లక్షల కోట్ల అప్పుతో అధికారంలోకి వచ్చాం..


ప్రభుత్వంలో ప్రతి జనసైనికుడూ భాగస్వామే అని తెలిపారు.ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై అవగాహన పెంచుకోవాలని.. ప్రజలకు వివరించాలన్నారు.ఇది మన ప్రభుత్వమని.. పార్టీకి.. పవన్‌కు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ టీం అంటే ఇదీ అని అందరూ గొప్పగా చెప్పుకునేలా పని చేయాలన్నారు.గత ఎన్నికల్లో ప్రజలు సైలెంటుగా ఓటేశారని.. ఎన్నికల ముందు వరకు ఏ మాత్రం బయటపడని ప్రజలు.. ఎన్నికల్లో తామేంటో చూపించారని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

TS News: సెక్రటేరియట్ ముట్టడి... రాజారాం యాదవ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం..

Supreme Court: ఇసుక అక్రమాలపై నివేదిక ఇవ్వండి... సుప్రీం ఆదేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 02:08 PM