Nara Lokesh: కల్తీ జగన్.. ఫేక్ ప్రచారాలు ఆపు.. వైసీపీకి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Oct 03 , 2024 | 10:05 PM
నీ దొంగ బుద్ధ వదలవు.. అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లంటూ నీ నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నావంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. వరదసాయంపై సోషల్ మీడియాలో ఓ తప్పుడు పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టును వైసీపీకి చెందిన సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో..
సామాజిక మాద్యమాల్లో వైసీపీ తప్పుడు ప్రచారాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కల్తీ జగన్.. ఈ పేక్ ప్రచారాలు ఎందుకంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. వరద సాయం ఎంత ఇచ్చాం.. సహాయక చర్యలకు ఎంత ఖర్చయింది. ఆహారం కోసం ఎంత ఖర్చు పెట్టామనే లెక్కలు ఓపెన్‌గానే ఉన్నాయని.. వీటిపై అసత్య ప్రచారం ఎందుకని ప్రశ్నించారు. అయినా నీ దొంగ బుద్ధ వదలవు.. అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లంటూ నీ నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నావంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. వరదసాయంపై సోషల్ మీడియాలో ఓ తప్పుడు పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టును వైసీపీకి చెందిన సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో మంత్రి లోకేశ్ వరద సాయం లెక్కలపై స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, లెక్కలన్నీ ఓపెన్‌గాను ఉన్నాయని చెప్పారు.
తప్పుడు పోస్టుతో గందరగోళం
వరద సాయం లెక్కలపై ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టు వాస్తవాలకు భిన్నంగా ఉందని, కేవలం ప్రభుత్వంపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై అపోహలు సృష్టించేందుకే వైసీపీ సోషల్ మీడియా తప్పుడు పోస్టులను సృష్టిస్తోందని కూటమి పార్టీ నేతలు చెబుతున్నారు.
పోస్టులో ఏముంది..
సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పోస్టులో రూ.23 కోట్లకు అగ్గిపెట్టాలా.. గుడ్డి విజనరీ అనడంలో తప్పులేదేమో అంటూ పోస్టులో పేర్కొన్నారు. కొవ్వొత్తులకు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లా.. ప్రభుత్వ లెకకల ప్రకారం 6 లక్షల మంది బాధితులు అంటూ పోస్టు వైరల్ అవుతోంది. ఒక్కో ఇంటికి ఐదు కొవ్వొత్తులు ఒక్కో కొవ్వొత్తి రూ.25, ఒక్కో ఇంటికి రెండు అగ్గిపెట్టేలు రూ.10 అయినా 2కోట్లకు మించి అవ్వదంటూ పోస్టు పెట్టారు. సంక్షోభంలో ఏ అవకాశం వచ్చినా దోపిడీ చేసుకోవడానికి ఆగే ప్రసక్తి లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. ఆ ప్రచారంలో వాస్తవం లేదని.. అది తప్పుడు పోస్టు అని క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here