Nimmala: ఎలాంటి కోతలు లేకుండానే ‘తల్లికి వందనం’ పథకం అమలు
ABN , Publish Date - Jul 13 , 2024 | 04:42 PM
Andhrapradesh: వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా ‘‘తల్లికి వందనం’’ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు.
అమరావతి జూలై 13: వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా ‘‘తల్లికి వందనం’’ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ విద్యార్థికి రూ.15 వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. ఓ పండుగ వాతావరణంలోనే తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామన్నారు. అబద్దాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటంట్ పొందిందని మంత్రి విమర్శించారు.
Telangana Politics: నాడు హీరో అన్నారు.. నేడు జీరో అంటున్నారు..!
2019లో వచ్చిన మూడంకెల సీట్లు 2024లో డబల్ డిజిట్‌కు పడిపోయునా వైసీపీకి బుద్దిరాలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కాకుండానే ఫించన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విషప్రచారం మొదలుపెట్టిన వైసీపీకి ఈసారి సింగిల్ డిజిటే అని స్పష్టమవుతోందన్నారు. ఆమ్మఒడి ఇద్దరు పిల్లలు ఉన్నా ఇస్తామని హామీ ఇచ్చి మాటతప్పి మడమ తిప్పింది జగన్ కాదా? అని ప్రశ్నించారు. తాము ఇంకా తల్లికి వందనం విధి విధానాలు రూపొందించక ముందే అసత్యాలు మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మఒడిని మోసం దగాతో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇచ్చి ప్రతీ ఏటా ఇస్తానన్న మొత్తం కూడా కుదించేశారన్నారు. అమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైసీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
CM Chandrababu: అధికారంలోకి వచ్చాం కదా అని అలసత్వం వద్దు..
Assembly bypolls: సీఎం భార్య గెలుపు, కాంగ్రెస్‌కు 2, బీజేపీకి ఒకటి
Read Latest AP News And Telugu News