Share News

Minister Narayana: బుడమేరుపై పుకార్లు సృష్టిస్తున్నారు

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:23 PM

విజయవాడలోని నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. న్యూ ఆర్.ఆర్.పేట,జక్కంపూడి సింగ్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తోందని కాసేపటి క్రితం నుంచి ప్రచారం జరుగుతోందని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.

Minister Narayana: బుడమేరుపై పుకార్లు సృష్టిస్తున్నారు

విజయవాడ: విజయవాడలోని నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. న్యూ ఆర్.ఆర్.పేట,జక్కంపూడి సింగ్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లోకి వరద వస్తోందని కాసేపటి క్రితం నుంచి ప్రచారం జరుగుతోందని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.


VMC కమిషనర్ ధ్యాన చంద్ర,ENC గోపాల కృష్ణా రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి సమాచారం తెలుసుకున్నట్లు వివరించారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అన్నారు. విజయవాడ పూర్తిగా సేఫ్‌గా ఉందని మంత్రి నారాయణ తెలిపారు.


బుడమేరుకు కేవలం 1000 క్యూసెక్కుల నీరు మాత్రమే..: కలెక్టర్ సృజన

ఎన్టీఆర్ జిల్లా: బుడమేరు కాలువపై గండ్లు పడ్డాయి అన్ని వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. బుడమేరుకు కేవలం 1000 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుందని అన్నారు. బుడమేరుకు ఎక్కడ గండ్లు పడలేదని చెప్పారు. ఎవరో కావాలని సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.ఎటువంటి గండ్లు పడలేదని సింగ్ నగర్, ఆర్ఆర్ పేట, మిల్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో అధికారులు మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు.

Updated Date - Sep 14 , 2024 | 10:47 PM