Share News

Ramprasadreddy: రవాణాశాఖ అధికారులపై మంత్రి ఫైర్..

ABN , Publish Date - Aug 09 , 2024 | 04:46 PM

Andhrapradesh: రవాణా శాఖలో ప్రక్షాళణకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణాశాఖలో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.

Ramprasadreddy: రవాణాశాఖ అధికారులపై మంత్రి ఫైర్..
Minister Ram prasad Reddy

విజయవాడ, ఆగస్టు 9: రవాణా శాఖలో ప్రక్షాళణకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణాశాఖలో కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా శాఖలో కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలివెళ్లాయన్నారు. అక్రమంగా వెళ్తున్న వాహనాలను పట్టుకోకపోవడమేంటని ఆర్టీఏ అధికారులను మంత్రి ప్రశ్నించారు. గతంలో రాష్ట్రంలో అక్రమంగా ఇసుక , ఖనిజాలు తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhatti Vikramarka: ఆగస్టు 15న రైతులను రుణ విముక్తి చేస్తాం..


ఈ సందర్భంగా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక, మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒకే నెంబర్‌తో పలు వాహనాలు తిరుగుతున్నాయని.. వాటిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. నిరంతరం తనిఖీలు చేసి అక్రమ రవాణా చేస్తోన్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. గత ఐదేళ్లలో రవాణా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై సమూల ప్రక్షాళన చేస్తామన్నారు. రవాణాశాఖలో అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అక్రమార్కుల పనిపట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ పాలనలో ఆర్టీసీలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల 2019-24 మధ్య ఆర్టీసీ నిర్వీర్యమైపోయిందన్నారు.

Telangana: ‘సుంకిశాల ఘటనకు కారణం వారే’


ఉద్యోగులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిలు, సమస్యల పరిష్కరిస్తామన్నారు. అమరావతి బ్రాండ్ ఏసీ బస్సులకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. ఓవర్ లోడ్ , ఫిట్ నెస్ లేకుండా, తిరుగుతోన్న వాహనాలపై తనిఖీలు చేసి జప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్లు, సిబ్బంది కొరతను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, బస్టాండ్లలో పరిశుభ్రతను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని స్పష్టం చేశారు. కారుణ్య నియామకాల్లో జాప్యాన్ని నివారించి వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది: వైఎస్ జగన్

YS Sharmila: ప్రత్యేక జీవనశైలి ఆదివాసీల సొంతం

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 09 , 2024 | 04:52 PM