Share News

Vijayawada: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు.. సెలబ్రిటీలు ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Dec 14 , 2024 | 09:37 PM

విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందని సినీ నటి జయప్రద చెప్పారు. విజయవాడ అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని ప్రేమని ఆమె చెప్పారు. నటనకే నటన నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని జయప్రద కొనియాడారు.

Vijayawada: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు.. సెలబ్రిటీలు ఏం చెప్పారంటే..
NTR Cine Vajrotsava Vedukalu

ఆంధ్రప్రదేశ్: విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి సినీ వజ్రోత్సవ వేడుకలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. జయప్రద, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా పలువురు వక్తలు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ తెలుగువారికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.


సాటి లేరు మరెవ్వరూ..

విజయవాడలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషకరంగా ఉందని సినీ నటి జయప్రద చెప్పారు. విజయవాడ అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని ప్రేమని ఆమె చెప్పారు. నటనకే నటన నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని జయప్రద కొనియాడారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆరే అని ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌తో గడిపిన క్షణాలు మరువలేనివని ఆమె తెలిపారు. 1963లో ఎన్టీఆర్‌తో తమ సినీ ప్రస్థానం మొదలైందని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి తామెంతో రుణపడి ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌లో మంచి రచయిత కూడా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు సురేశ్ బాబు. చంద్రబాబు స్ఫూర్తితో తన తండ్రి రామానాయుడు రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కళాకారులు మాత్రమే కాదు.. అందరూ జరుపుకోవాలని సినీ నటి ప్రభ అన్నారు. పేదవారి కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ఆమె చెప్పారు. కల్మషం లేని మంచి వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తాను హీరోయిన్‌గా ఇక్కడకు రాలేదని, ఎన్టీఆర్ అభిమానిగా, మీలో ఒకరిగా వచ్చినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌కు కచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభ కోరారు.


ఎన్టీఆర్ గొప్ప సంఘసంస్కర్త..

ఏడాది పాటు 100 దేశాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించామని టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మరెవ్వరికీ అలా జరగలేదని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ గొప్పతనం భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆయన పాత ఫొటోలను డిజిటలైజ్ చేశామని చెప్పారు. ప్రపంచ సినీ చరిత్రలో ఎన్టీఆర్‌కు సాటి మరెవ్వరూ లేరని జనార్దన్ చెప్పుకొచ్చారు. ప్రతి పాత్రకు దేనికదే సాటి అనే రీతిలో ప్రాణం పోశారని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప మానవతావాదే కాకుండా గొప్ప సంఘ సంస్కర్త అని టీడీ జనార్దన్ కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Vijayawada: తెలుగు వారు ఉన్నంత వరకూ గుర్తుండే పేరు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు..

TDP: సరికొత్త రికార్డు సృష్టించిన టీడీపీ పార్టీ.. ఏకంగా..

CM Chandrababu: అల్లు అర్జున్‌కు ఫోన్ చేసిన సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..

Updated Date - Dec 14 , 2024 | 09:38 PM