Share News

AP Election Polling 2024:వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎస్పీ నయీం అస్మి వార్నింగ్

ABN , Publish Date - May 13 , 2024 | 08:52 PM

నగరంలోని పోరంకిలో ఈరోజు పోలింగ్‌లో జరిగిన ఘర్షణలపై విచారణ చేస్తున్నామని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా ఎస్పీ నయీం అస్మి (SP Naeem Asmi) హెచ్చరించారు. సోమవారం మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ఆరు గంటల్లోపు బూత్ లోపలికి వచ్చిన వారికి ఓటు వేసే సౌకర్యం ఉంటుందని ఎస్పీ తెలిపారు.

AP Election Polling 2024:వారిపై చర్యలు తీసుకుంటాం..  ఎస్పీ నయీం అస్మి వార్నింగ్
SP Naeem Asmi

విజయవాడ: నగరంలోని పోరంకిలో ఈరోజు పోలింగ్‌లో జరిగిన ఘర్షణలపై విచారణ చేస్తున్నామని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా ఎస్పీ నయీం అస్మి (SP Naeem Asmi) హెచ్చరించారు. సోమవారం మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ఆరు గంటల్లోపు బూత్ లోపలికి వచ్చిన వారికి ఓటు వేసే సౌకర్యం ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోరంకిలో జరిగిన ఘర్షణపై విచారణ చేస్తామని అన్నారు. పార్టీల తరపున బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


ఇరువర్గాల మధ్య రాళ్లదాడి జరిగిందని.. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారని చెప్పారు. ఇంత ఘర్షణ వాతావరణం జరగడంలో తమ వాళ్ల వైఫల్యం ఉందని భావిస్తున్నామన్నారు. ఈ రోజు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యాక.. విచారణ చేస్తామని తెలిపారు. తమ సిబ్బంది తప్పు ఉందని తేలితే వారి పైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఇరు వర్గాల ఘర్షణతో కొంత ఉద్రిక్తత నెలకొందని ఎస్పీ నయీం అస్మి అన్నారు.

AP Elections: ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ ఏజెంట్లపై దాడులు..?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 13 , 2024 | 09:06 PM