Donations: ఏపీ వరద బాధితులకు సుప్రీం తెలుగు న్యాయవాదుల విరాళం
ABN , Publish Date - Sep 25 , 2024 | 02:55 PM
Andhrapradesh: ఏపీ వరద బాధితులకు సుప్రీం కోర్టు తెలుగు న్యాయవాదులు విరాళం అందజేశారు. దాదాపు రూ.15లక్షలు విరాళంగా ఇచ్చారు. బుధవారం నాడు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌ను కలిసి తెలుగు న్యాయవాదులు చెక్కులు అందజేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ఏపీ వరద బాధితులకు (AP Flood Victims) విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖుులు, పారిశ్రామివేత్తలు, పలువురు ప్రముఖులు తమ వంతు సహాయాన్ని అందజేశారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును(CM Chandrababu Naidu) కలిసి విరాళాల చెక్కులను అందజేశారు కూడా. తాజాగా ఏపీ వరద బాధితులకు సుప్రీం కోర్టు తెలుగు న్యాయవాదులు విరాళం అందజేశారు. దాదాపు రూ.15 లక్షలు విరాళంగా ఇచ్చారు. బుధవారం నాడు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌ను కలిసి తెలుగు న్యాయవాదులు చెక్కులు అందజేశారు.
AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వై.రాజగోపాల్ రావు మాట్లాడుతూ.. విజయవాడ వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించామని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌ను కలిసి చెక్కులను అందజేశామన్నారు. ప్రభుత్వం వరదల్లో చక్కగా పనిచేసి ప్రజలను ఆదుకుందని కొనియాడారు. దాదాపు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించినట్లు తెలిపారు. విరాళం అందించిన వారిలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి చల్లా కోదండరాం రూ.5 లక్షలు, వై రాజగోపాలరావు రూ.2 లక్షల, దామా శేషాద్రి నాయుడు లక్ష, ఆర్ ఆనంద్ పద్మనాభన్ రూ.75 వేలు, అల్లంకి రమేష్ రూ.50 వేలు, ఉదయకుమార్ సాగర్ శెట్టి రూ.50 వేలు విరాళంగా అందజేశారు.
ఇవి కూడా చదవండి..
AP Govt: వరద బాధితులకు ప్రభుత్వం అందించిన నష్ట పరిహార వివరాలు ఇవే
Chandrababu: బోట్ల ఘటన.. కచ్చితంగా వైసీపీ కుట్రే
Read Latest AP News And Telugu News