Share News

Budda Venkanna: మీడియాపై విజయసాయి వ్యాఖ్యలు సిగ్గుచేటు..

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:38 PM

Andhrapradesh: జర్నలిస్టులు, మీడియాపై రాజ్యసభ సభ్యులు విజసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. విజయసాయిరెడ్డిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మీడియాపై విజయసాయి చేసిన కామెంట్స్‌ను టీడీపీ నేత బుద్దా వెంకన్న తప్పుబట్టారు.

Budda Venkanna: మీడియాపై విజయసాయి వ్యాఖ్యలు సిగ్గుచేటు..
TDP Leader Budda Venkanna

విజయవాడ, జూలై 18: జర్నలిస్టులు, మీడియాపై రాజ్యసభ సభ్యులు విజసాయిరెడ్డి (Vijayasai reddy) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. విజయసాయిరెడ్డిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మీడియాపై విజయసాయి చేసిన కామెంట్స్‌ను టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Budda Venkanna) తప్పుబట్టారు. విజయసాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై విజయ్ సాయి రెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటన్నారు.

Mashco Piro: కెమెరాకు చిక్కిన ‘మాష్కో పిరో’ ఆటవిక తెగ ప్రజలు.. అరుదైన ఫొటో, వీడియోలు ఇవిగో


నిజాన్ని వెలికి తీయడం తప్ప మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయ్ సాయి రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచడమా... గతంలో సాక్షి చేసింది ఏమిటి అని ఎదురుదాడికి దిగారు. ఎంతమందిని విజయ్ సాయి రెడ్డి వ్యక్తిగతంగా దూషించలేదు అని నిలదీశారు. కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బేషారతుగా మీడియా సంస్థలకు, సంస్థ యజమానులకు క్షమాపణ చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ


మరోవైపు విజయవాడలో విజయసాయి రెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు నిరసనకు దిగారు. ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున వివిధ సంస్థల జర్నలిస్టులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

Jagan: నడిరోడ్డుపై జరిగిన దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు

TDP: టీడీపీలో చేరబోతున్నామంటూ వంశీ అనుచరుల హల్‌చల్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 18 , 2024 | 12:38 PM