Minister Lokesh: ఆ ఫొటోలు తీసి అప్‍లోడ్ చేసేపని టీచర్లకు లేదు: మంత్రి లోకేష్
ABN , Publish Date - Aug 06 , 2024 | 01:53 PM
అమరావతి: ప్రతిరోజూ ఉదయం పాఠశాలకు రాగానే బాత్‌రూమ్‌ల పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫొటోలను తీసి అప్‍లోడ్ చేసేపని ఇక ఉపాధ్యాయులకు లేదని, ఈ విధానాన్ని ఆపేశామని.. ఈ ఆప్షన్‍ను యాప్ నుంచి కూడా తొలగించామని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అమరావతి: ప్రతిరోజూ ఉదయం పాఠశాలకు రాగానే బాత్‌రూమ్‌ల పరిశుభ్రతను (Cleanliness of bathrooms) తెలిపేలా వాటి ఫొటోలను (Photos) తీసి అప్‍లోడ్ (Upload) చేసేపని ఇక ఉపాధ్యాయులకు (Teachers) లేదని, ఈ విధానాన్ని ఆపేశామని.. ఈ ఆప్షన్‍ను యాప్ (App) నుంచి కూడా తొలగించామని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను పిల్లలకు టీచర్లు అందించాలని, క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార బాధ్యతను తాము తీసుకుంటామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్..
కాగా గత ప్రభుత్వం వివాదాస్పద రీతిలో ప్రవేశపెట్టిన బాత్‌రూమ్‌ల ఫొటోల యాప్‌కు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. బాత్‌రూమ్ ఫొటోలు తీసి అప్‌లోడ్ చేసే యాప్‌ను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో అనేక రకాల యాప్‌లు తీసుకొచ్చింది. ప్రతిరోజూ టీచర్లు ఆ యాప్‌లు వినియోగించి సమాచారం అప్‌లోడ్ చేసే విధానాన్ని ప్రారంభించింది. అందులో ఒకటి బాత్‌రూమ్ ఫొటోల క్యాప్చరింగ్ యాప్. ప్రతిరోజూ ఉదయం పాఠశాలకు రాగానే టీచర్లు బాత్‌రూమ్‌ల పరిశుభ్రతను తెలిపేలా వాటి ఫొటోలను తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇలా తమతో బాత్‌రూమ్‌ల ఫొటోలు తీయించడం అవమానకరంగా ఉందని, ఈ ఒక్క యాప్‌ను వెంటనే తొలగించాలని అప్పట్లో టీచర్లు గగ్గోలు పెట్టారు. కానీ ప్రభుత్వం వినిపించుకోలేదు. అయితే, ఇది టీచర్లను అవమానించినట్లుగా ఉందని భావించిన టీడీపీ ప్రభుత్వం ఆ యాప్‌ను పూర్తిగా తొలగించింది. యాప్‌ను తొలగించినందుకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి, నోబుల్ టీచర్స్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకట్రావు, బి.హైమారావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అనాలోచితంగా సీబీఎస్ఈ: మంత్రి లోకేశ్
గత ప్రభుత్వం అనాలోచితంగా వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభించిందని మానవ వనరుల మంత్రి నారా లోకేశ్ అన్నారు. కేజీబీవీ సహా వెయ్యి పాఠశాలల్లో విద్యార్థులు ఈ ఏడాది తొలిసారి సీబీఎస్ఈ పరీక్షలు రాయబోతున్నారని, వారి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రమాణాలు మెరుగుపర్చాల్సి ఉందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు.
ఒత్తిడిలేని విద్యా విధానం అవసరం: సీఎం
రాష్ట్రంలో వర్చువల్ వర్కింగ్ పాలసీని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఒత్తిడి లేని విద్యావిధానం అవసరమని, పిల్లలంతా కచ్చితంగా బడిలో ఉండాల్సిందేనని ఆయన ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సదస్సులో భాగంగా మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే విధానం పెరిగింది. భవిష్యత్తులో వర్చువల్ వర్కింగ్‌కు అవకాశాలెక్కువ. దీనికోసం తొలుత డ్రాఫ్ట్ పాలసీ రూపొందించి, దానిపై నిపుణులతో చర్చించాలి. ఆంధ్రప్రదేశ్ వర్చువల్ వర్కింగ్‌కు హబ్‌గా మారాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీచర్లకు ఆ భారం తప్పించిన ఏపీ ప్రభుత్వం..
సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టిన చింతా మోహన్
కలెక్టర్లతో సీఎం చంద్రబాబు భేటీ.. (ఫోటో గ్యాలరీ)
తెలంగాణ ప్రభుత్వంతో కాగ్నిజెంట్ ఎంవోయు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News