Share News

YCP VS TDP : ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత.. వైసీపీ ,టీడీపీ నేతల ఘర్షణ

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:02 PM

విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలో వైసీపీ ( YCP ) , టీడీపీ ( TDP ) పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల్లోని నేతలు దాడి చేసుకున్నారు. దీంతో గొడవకు దిగిన వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిడమానూరులో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు నూతన సంవత్సరం సందర్భంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.

YCP VS TDP : ఎన్టీఆర్ జిల్లాలో ఉద్రిక్తత.. వైసీపీ ,టీడీపీ నేతల ఘర్షణ

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలో వైసీపీ ( YCP ) , టీడీపీ ( TDP ) పార్టీల మధ్య ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల్లోని నేతలు దాడి చేసుకున్నారు. దీంతో గొడవకు దిగిన వారిని పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిడమానూరులో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు నూతన సంవత్సరం సందర్భంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీంతో ఒకరిపై ఒకరు అజమాయిషికి ఫ్లెక్సీలు చింపుకున్నారు. అయితే ఈవివాదం చిలికి చిలికి గాలి వానలా మారినట్లుగా వైసీపీ, టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ నేతలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ప్రాంతంల్లో పోలీసులు భారీగా మోహరించారు.

గతంలో వలంటరీగా పని చేసిన నల్లబోతు సుందర్ కుమార్ వైసీపీ ప్లెక్సీ‌ని చించేశాడని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే వైసీపీ ఫ్లెక్సీలను తెలుగుదేశం నేతలు చించేయడంపై ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అయితే వలంటరీ తండ్రి టీడీపీ నాయకుడు కావడంతో నూతన సంవత్సరం సందర్భంగా టీడీపీ నేతలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే టీడీపీ ఫ్లెక్సీలను చించేయడంపై ఆ పార్టీ నిడమానూరు గ్రామ నాయకులు స్పందించారు. అయితే ఈ సమయంలో అక్కడ ఉన్న టీడీపీ నాయకులపై నిడమానూరు వైసీపీ సర్పంచ్ శీలం రంగారావు చేయి చేసుకున్నారు‌. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతపై వైసీపీ సర్పంచ్ రంగారావు దాడి చేశాడు. ఈ దాడిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. రోడ్లపై నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలను ఏమనకుండా తమపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఈఘటనకు సంబంధించి ఇరువర్గాలు పడమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి.

Updated Date - Jan 01 , 2024 | 11:02 PM