Share News

YSRCP: తవ్వేకొద్దీ బయటపడుతున్న వైసీపీ అరాచకాలు.. అడ్డంగా బుక్కవుతున్న అధికారులు..

ABN , Publish Date - Aug 27 , 2024 | 07:10 PM

వైసీపీ నేతల అరాచకాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాయి. పైకి ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులుగా కనిపించే కొందరు ఐపీఎస్‌లు వైసీపీ నేతల అరాచకాలకు వంతపాడినట్లు తెలుస్తోంది.

YSRCP: తవ్వేకొద్దీ బయటపడుతున్న వైసీపీ అరాచకాలు.. అడ్డంగా బుక్కవుతున్న అధికారులు..
Jagan and Sajjala

వైసీపీ అరాచకాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. అధికారంలో ఉన్న ఐదేళ్లూ చేసిన తప్పులన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మనవాడంటే చాలు.. ఎంతటి అరాచకానికైనా పాల్పడ్డారనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. తాడేపల్లి నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం.. కొందరు ఐపీఎస్ అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ అరాచకాలపై పూర్తిగా ఫోకస్ పెట్టకముందే పదుల సంఖ్యలో ఘటనలు బయటపడుతున్నాయి. ప్రభుత్వం దృష్టిసారిస్తే ఇంకెన్ని ఘటనలు బయటపడతాయోనన్న చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో కొందరు పోలీసు అధికారులు నిబంధనలు పాటించడం లేదని అప్పటి ప్రతిపక్షం టీడీపీ నేతలు గొంతు చించుకున్నా.. అధికార వైసీపీ పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు బనాయించారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతల అరాచకాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాయి. పైకి ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులుగా కనిపించే కొందరు ఐపీఎస్‌లు వైసీపీ నేతల అరాచకాలకు వంతపాడినట్లు తెలుస్తోంది.

TDP: టీడీపీలో చేరిన మేయర్ దంపతులు


తాజా ఘటనతో..

కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత కోసం మాజీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో పోలీసులు ముంబయికి చెందిన ఒక నటిపై అక్రమంగా కేసు బనాయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తున్నానంటూ నటించి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసే సరికి.. వైసీపీ పెద్దల సహాయం తీసుకుని.. నటితో పాటు వారి కుటుంబ సభ్యులను కొందరు ఐపీఎస్ అధికారులు తీవ్రంగా వేధించారనే విషయం వెలుగులోకి వచ్చింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా నటిని బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని.. పెళ్లి ప్రస్తావన తీసుకురాకూడదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఘటన బయటకు రావడం వైసీపీ నేతల అరాచకాలకు అద్దంపడుతోంది. ఈ ఒక్క ఘటన కాకుండా ఇలాంటి ఎన్నో ఘటనలు గత ప్రభుత్వంలో జరిగాయనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్‌కు ఇవ్వన్నీ తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో నాయకులంతా తమ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ నేతల అరాచకాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అప్పట్లో పోలీసులు అసలు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.
Buddha Venkanna: మాపై అకారణంగా పిన్నెల్లి బ్రదర్స్ దాడి


భూకబ్జాలపై ఉక్కుపాదం..

ఓవైపు పోలీసులను అడ్డంపెట్టుకుని అక్రమ కేసులు బనాయింపు.. మరోవైపు అధికారులను అడ్డంపెట్టుకుని వైసీపీ నాయకులు భూములను కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఇంకా భూకబ్జాలపై ఫోకస్ చేయలేదు. మొదటి హెచ్చరికగా మంత్రి నారాయణ భూకబ్జాదారులకు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో భూములు కబ్జా చేసిన వాళ్లంతా వాటిని వదిలేయాలని.. లేదంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. విశాఖలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతున్నాయి. అవసరమైతే హైడ్రా లాంటి సంస్థను తీసుకొస్తామని హెచ్చరించారు. దీంతో భూకబ్జాదారులపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇంకెన్నీ అక్రమాలు, అరాచకాలు బయటకు వస్తాయో చూడాలి మరి.


AP Politics: వైసీపీ అధిష్టానంపై బాలినేని సంచలన కామెంట్స్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 27 , 2024 | 07:10 PM