AP Politics: ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా.. అహంకారంతో ముందుకెళ్తారా..!
ABN , Publish Date - Jun 15 , 2024 | 03:19 PM
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమికి అవునన్నా.. కాదన్నా ఆ పార్టీ అధినేత జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు, వ్యవహరశైలి గెలుపోటముల్లో కీలకంగా మారతాయి.
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమికి అవునన్నా.. కాదన్నా ఆ పార్టీ అధినేత జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు, వ్యవహరశైలి గెలుపోటముల్లో కీలకంగా మారతాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమికి జగన్ ఏకపక్ష నిర్ణయాలు, అహంకారమే ప్రధాన కారణాలుగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అయినా జగన్ తన వైఖరి మార్చుకుంటే మంచిదని.. ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తే పార్టీ మనుగడ కష్టమవుతుందనే అభిప్రాయం వైసీపీలో కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu: ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
ఎవరి మాట వినకపోవడం.. ప్రభుత్వం తప్పులను ప్రతిపక్షం ఎత్తిచూపించినా సరిచేసుకోకుండా ముందుకువెళ్లడంతోనే ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పార్టీని ముందుకు నడిపించాలంటే జగన్ కొంత వెనక్కి తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చర్చ నడుస్తోంది. అయితే ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలను చూసిన తర్వాత.. ఆయన తన పద్ధతిని మార్చుకోలేదని.. ఇంకా అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల విశ్వాసాన్ని ఎందుకు పొందలేకపోయామనే విషయంపై సమీక్షించుకుని.. వచ్చే ఎన్నికల్లో పుంజుకుంటామని చెప్పుకుండా.. ప్రజల పూర్తి మద్దతు పొందిన ప్రభుత్వంపై మొదటి రోజు నుంచే విమర్శలు చేయడం చూస్తే ఎన్నికల ఫలితాల నుంచి జగన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదనే విషయం స్పష్టమవుతుందట.
TG Bharath: సమస్యలు తీరిస్తే భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది: మంత్రి టీజీ భరత్
మండలిలో మెజార్టీపై..
వైసీపీ అధినేత జగన్ ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. శాసనసభలో బలం లేకపోయినా.. శాసనమండలిలో తమకు ఇంకా బలం ఉందంటూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రజలు సంబంధించిన ఏవైనా చట్టాలు చేయడం లేదా కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది శాసనసభలోనే.. ఏదైనా ఒక చట్టానికి సంబంధించి శాసనమండలి ఆమోదించకపోయినా.. అది చట్టంగా మారే అవకాశం ఉంటుంది. అదే శాసనసభ అనుమతి లేకుండా శాసనమండలి ఎటువంటి చట్టాలను చేయలేదు. అయితే జగన్ మాత్రం ఇంకా తమకు శాసనమండలిలో మద్దతు వైసీపీకి ఉందని.. దీంతో మండలిలో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేయాలంటూ పరోక్షంగా సంకేతాలిచ్చినట్లైందని కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రజాతీర్పును గౌరవించకుండా.. ఇంకా అహంకార ధోరణితో ముందుకెళ్లడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ సీఎం జగన్ మాత్రం ప్రభుత్వాన్ని ఏ విధంగా మంచి పనులు చేయకుండా ఇబ్బంది పెట్టాలనే కోణంలో ఆలోచిస్తున్నారి.. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదనే అభిప్రాయం మేధావుల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జగన్ ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిదని.. లేకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న చర్చ జరుగుతోంది.
Atchannaidu: విత్తనాలు, ఎరువుల కొరత రానివ్వొద్దంటూ అధికారులకు ఆదేశాలు
Chandrababu: ప్రక్షాళన ప్రారంభించిన చంద్రబాబు.. సీఎస్, డీజీపీలతో భేటీ
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News