AP NEWS: శ్రీశైలం ఆలయంలో రక్షణ చర్యలు లేకే పులిహోరలో మాంసపు ఎముక: బైరెడ్డి శబరి
ABN , Publish Date - Feb 09 , 2024 | 10:49 PM
శ్రీశైలంలో పులిహోరలో మాంసపు ఎముక కలకలం సృష్టించింది. అయితే పులిహోరలో మాంసపు ఎముక ఉండటం మహా పాపమని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు బైరెడ్డి శబరి అన్నారు.
నంద్యాల: శ్రీశైలంలో పులిహోరలో మాంసపు ఎముక కలకలం సృష్టించింది. అయితే పులిహోరలో మాంసపు ఎముక ఉండటం మహా పాపమని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం ఆలయంలో సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఆపరేటర్స్, ప్రసాదం తయారు చేసే సిబ్బందిలో చాలా మంది ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మనుషులే ఉన్నారని... వారు సరైన రక్షణ చర్యలు లేకుండా ప్రసాదం తయారీ చేస్తున్నారని ఆరోపించారు.
శ్రీశైలంలో అవకతవకలు దారుణాలు జరుగుతున్నాయని పలుమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పులిహోరలో మాంసపు ఎముక ఘటనపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఎంపీ, శ్రీశైలం ఆలయ ఈవో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆలయ పరిధిలో వైసీపీ ‘సిద్ధం’ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని.. నిబంధనలకు విరుద్ధంగా ఇలా ఏలా ఏర్పాటు చేశారని శబరి ఆలయ అధికారులను నిలదీశారు. శ్రీశైల ఆలయం పవిత్రతను డ్యామేజ్ చేయడానికే వైసీపీ నాయకులు సిద్ధమయ్యారని బైరెడ్డి శబరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.