Srisailam: మల్లన్న పాదయాత్ర భక్తుల సౌకర్యాలను పరిశీలించిన ఈవో
ABN , Publish Date - Feb 26 , 2024 | 01:57 PM
Andhrapradesh: శ్రీశైలం మల్లన్న పాదయాత్ర భక్తుల సౌకర్యాలను ఈఓ పెద్దిరాజు అడవి మార్గంలో పరిశీలించారు. నల్లమల అడవి ప్రాంతమైన నాగలూటి, పెద్దచెరువు తుమ్మబైలు అటవీ ప్రాంతాలలో మంచీరు, ఆహారం భక్తులకు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఈవో ఆదేశించారు.
నంద్యాల, ఫిబ్రవరి 26: శ్రీశైలం మల్లన్న (Srisailam Temple) పాదయాత్ర భక్తుల సౌకర్యాలను ఈఓ పెద్దిరాజు (EO Peddiraju) అడవి మార్గంలో పరిశీలించారు. నల్లమల అడవి ప్రాంతమైన నాగలూటి, పెద్దచెరువు తుమ్మబైలు అటవీ ప్రాంతాలలో మంచినీరు, ఆహారం భక్తులకు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఈవో ఆదేశించారు. పాదయాత్ర మార్గంలో భక్తులు సేదతీరడానికి చలువ పందిళ్ళు, సౌచాలయలు గత సంవత్సరం కంటే ఎక్కువ ఏర్పాట్లు ఉండాలని త్వరగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అటవీశాఖ అధికారుల నుంచి త్వరగా జంగిల్ క్లియరెన్స్ తీసుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులకు అటవీ ప్రాంతంలో త్రాగునీటి కోసం సింటెక్స్ ట్యాంక్‌లు ఏర్పాటు చేసి కొనేరులు శుభ్రపరచి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఈవో పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...