Share News

Tungabhadra: తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తివేత.. అధికారుల హెచ్చరికలు

ABN , Publish Date - Aug 03 , 2024 | 09:58 AM

Andhrapradesh:

Tungabhadra: తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తివేత.. అధికారుల హెచ్చరికలు
Tungabhadra Resrvoir

కర్నూలు, ఆగస్టు 3: జిల్లాలోని కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి (Tungabhadra Resrvoir) వరద పోటెత్తింది. దీంతో అధికారులు జలశయం నుంచి 33 గేట్ల ద్వారా నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా... ప్రస్తుతం నీటి మట్టం 1631,14 అడుగులకు చేరింది. అలాగే ఇన్ ఫ్లో 1,71,353 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,74,675 క్యూ సెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 98,414 టీఎంసీలుగా కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తివేసిన నేపథ్యంల నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ఎక్కడ..!?


srisailam-project.jpg

అటు నంద్యాల శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ ఫ్లో 4,54,710 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 5,16,501 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం 883.800 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా... ప్రస్తుతం : 204.7888 టీఎంసీలుగా ఉంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

YSRCP: బొత్స ఎంపికపై వైసీపీ నేతల్లో గరంగరం!


మరోవైపు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద భారీగా తగ్గుముఖం పట్టింది. స్పిల్ వే ఎగువన 31.290, దిగువన 22.595 మీటర్ల నీటి మట్టం ఉంది. గోదావరి దిగువకు7 లక్షల 16 వేల 051 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: ఉచిత ఇసుకలో సమస్యలెందుకు?

Gold Rates: 70 వేల మార్క్ చేరిన బంగారం ధర

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 03 , 2024 | 10:05 AM