AP NEWS: శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మో త్సవాలు
ABN , Publish Date - Feb 09 , 2024 | 10:52 PM
శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతామని కలెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు,భద్రతపై 4 జిల్లాల అధికారులతో కలెక్టర్ శ్రీనివాసులు ఎస్పీ రఘువీర్ రెడ్డి శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
నంద్యాల: శ్రీశైలంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతామని కలెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు,భద్రతపై 4 జిల్లాల అధికారులతో కలెక్టర్ శ్రీనివాసులు ఎస్పీ రఘువీర్ రెడ్డి శుక్రవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పది లక్షలకు పైగా భక్తులు వస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు ఇరు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక నుంచి సుమారు 1120 బస్సులను నడపుతారని ఏపీ, టీఎస్, కర్ణాటక ఆర్టీసీలు చెప్పాయన్నారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అటవీప్రాంతంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు.
ట్రాఫిక్ పార్కింగ్ దిగునీరు క్యూలైన్సు విద్యుత్ విధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం సుమారు 35 లక్షల లడ్డూలను అందుబాటులో దేవస్థానం ఉంచనున్నదని ఆలయ చైర్మన్ తెలిపారు. భక్తులకు సులభతరంగా దర్శనం కోసం నాలుగు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.ట్రాఫిక్ సమస్య లేకుండా 75 సీసీ కెమెరాలతో పాటు అదనంగా అవసరమైన చోట్ల డ్రోన్ కెమెరాలతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తామని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు.